భర్త అంటే బాధపెట్టేవాడే కాదూ.. ఇలాంటి వారు కూడా ఉంటారు

గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:57 PM

భర్త అంటే బాధపెట్టేవాడే కాదూ.. ఇలాంటి వారు కూడా ఉంటారు

గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు. అయితే అది అవాస్తవం అనలేం అలా అని నిజమని కుండ బద్ధలు కొట్టలేం. చిన్న చిన్న గొడవలు ఉంటేనే భార్యా భర్తల బంధం బలపడుతుందని అంటారు. కానీ కొన్ని సార్లు ఈ బంధం బలహీన పడి.. చివరకు విడాకులకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కానీ మనం చెప్పుకునే బంధం మాత్రం.. మరణం తర్వాత కూడా కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.

భార్య చనిపోయినా ఆమెనే తలచుకుంటూ కాలం వెళ్లబోస్తున్నాడు ఓ పెద్దాయన. అంతే కాదూ ఆమెకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తూ.. దేవతలా కొలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన మత్తయ్య, లక్ష్మి దంపతులు. అయితే లక్ష్మి ఏడేళ్ల క్రితం చనిపోయింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మత్తయ్య.. ఆమెను నిత్యం స్మరించేలా గుడి కట్టాలనుకున్నాడు. రూ. 4 లక్షలు ఖర్చు చేసి మరణించిన భార్య పేరిట గుడి కట్టి.. విగ్రహం ప్రతిష్టించి, పూజలు చేస్తున్నారు. ఆ పక్కనే శివుడు, నంది, విగ్రహాలను నెలకొల్పారు. ప్రతి రోజు ఆమెకు పూజలు చేస్తూ ఆ గుడిలోనే తన సమయాన్ని గడుపుతున్నాడు. ఇక ఆమె వర్థంతి సమయాల్లో మానసిక వికలాంగులకు, నిరుపేదలకు అన్నదానం చేస్తూ భార్యపై తనకున్న ప్రేమను చాటుతున్నారు.