Summer Tips: పెరుగుతున్న ఎండలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం!

వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు కూడా 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు ఎండల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. వాహనాలను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టిప్స్ గనుక మీరు ఫాలో అయితే మీ కారు, బైకు ఈ ఎండాకాలం ఎంతో సేఫ్ గా ఉంటాయి.

Kaburulu

Kaburulu Desk

April 1, 2024 | 02:07 PM

Summer Tips: పెరుగుతున్న ఎండలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం!

భానుడి భగభగలు ప్రజలను వణికిస్తున్నాయి. మండే ఎండాకాలంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుంటే బయటకు రాకూడదు. ఉదయం- సాయంత్రం మాత్రమే పనులు చేసుకోవాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఇలాంటి సూచనలు అందరికీ వర్తిస్తాయి. కానీ, కొందరు మాత్రమే వాటిని పాటించగలరు. ఉద్యోగం, బాధ్యతలు, వృత్తిని బట్టి కాలంతో సంబంధం లేకుండా కొందరు పనులు చేస్తూనే ఉండాలి. అలాగే వారి వాహనాలు కూడా రుతువుతో సంబంధం లేకుండా పరిగెడుతూనే ఉండాలి. అయితే విడి కాలాలాల సంగతి పక్కన పెడితే ఎండాకాలంలో మాత్రం వాహనదారులు తప్పుకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఫ్యూయల్‌ తో జాగ్రత్త:

ఎండాకాలంలో అందరూ ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త పెట్రోల్‌- డీజిల్ విషయంలోనే. ఎందుకంటే వాహనం ఏదైనా కూడా ఎండాకాలంలో వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండలకు ఆయిల్ ఆవిరవ్వడమే కాకుండా.. బండి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఫుల్‌ ట్యాక్‌ చేయించే అలవాటు ఉన్నవాళ్లు అవసరాన్ని బట్టి ఫ్యూయల్‌ పోయించుకోండి. బైకులు వాడేళ్లు ట్యాంక్‌ కి ఏదైనా క్లాత్‌, ట్యాంక్‌ కవర్ వంటివి వాడితే మంచిది.

టైర్లపై దృష్టి పెట్టండి:

ఎండాకాలంలో రోడ్లు ఎంతో వేడిగా ఉంటాయి. తారు రోడ్లు అయితే సెగలు కక్కుతుంటాయి. ఆ వేడి మొత్తాన్ని ముందుగా గ్రహించేది మీ బండి టైర్లే. ఎంత ఎక్కువ ఎండ ఉంటే టైర్లపై అంత ఒత్తిడి ఉంటుంది. ఎండాకాలం సాధ్యమైనంత వరకు తక్కువ దూరాలే ప్రయాణం చేయడం మంచిది. బండిని ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయకండి. దానివల్ల టైర్లు త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా పాత టైర్లను వాడటం మానేయండి. టైర్లలో పరిమితికి మంచి గాలి పెట్టించకండి. గాలి ఎక్కువ ఉంటే టైరులో పీడనం ఎక్కువగా ఉంటుంది. బయట వేడిమి, లోపల పీడనం వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు లైఫ్‌ ఉన్న టైర్లనే వాడండి.

బండి కండిషన్:

బండి కండిషన్ లో ఉండటం చాలా ముఖ్యం. కారైనా, బైక్ అయినా ఎండాకాలంలో సాధారణం కంటే వాటిపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్వీసింగులు చేయించుకోండి. బైకులు ఉన్న వాళ్లు ఇంజిన్ ఆయిల్ మార్చు కోవడం, బ్యాటరీ చెక్ చేయించుకోవడం మంచి. కార్లు ఉన్న వాళ్లు ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఏసీ ఫిల్టర్లు, బ్యాటరీ కండిషన్‌ చెక్ చేయించుకోవడం మంచిది. కార్లలో కంటిన్యూగా కిలో మీటర్లు కిలో మీటర్లు డ్రైవ్ చేయకుండా మధ్యలో బ్రేక్ ఇవ్వడం మంచిది.

ఈవీలతో జాగ్రత్త:

ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బైకులు, కార్లు తెగ కొనేస్తున్నారు. అయితే ఎండలతో ఈవీ ఓనర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ని సాధారణ బండ్లు మాదిరే వాడేస్తున్నారు. వాటికి ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాటరీ వేడిగా ఉన్న సమయంలో ఛార్జ్‌ చేయకూడదు. అంటే ఇంటికి వెళ్లగానే స్కూటీకి ఛార్జ్ పెట్టకండి. కాస్త సమయం తీసుకోండి. రాత్రులు కూడా వాతావరణం వేడిగానే ఉంటుంది. కాబట్టి ఛార్జ్ పెట్టేసి అలాగే వదిలేయకండి. దానివల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

బైకర్లు జర భద్రం:

బైకులు, కార్లని జాగ్రత్తగా చూసుకోవాలో.. మీ గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. బైక్‌ పై ప్రయాణించేవాళ్లు ఎక్కువ దూరాలు వెళ్లకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉదయం, సాయంత్రం ప్రయాణించడం మంచిది. కాటన్‌ దుస్తులు ధరిస్తే కాస్త కంఫర్ట్ గా ఉంటుంది. ఫుల్‌ హ్యాండ్స్‌ వేసుకుని చేతులు కప్పుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యం. మీ బ్యాగులో వాటర్‌ బాటిల్ ఉండేలా చూసుకోండి. ప్రమాదకర కిరణాల నుంచి కాపాడుకునేందుకు.. కళ్లకు షేడ్స్‌ వాడితే మంచిది. హెల్మెట్ లోకి వేడిగాలి రాకుండా చూసుకోండి. అవసరాన్ని బట్టే ప్రయాణాలు చేయండి. ఈ ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి. ఈ టిప్స్‌ ని మీ మిత్రులతో షేర్‌ చేసి.. వారిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి.