వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్‌ చలానాలు కట్టించుకుంటుంది.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:55 PM

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై కులాల, మతాల పేర్లున్న స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్‌ చలానాలు కట్టించుకుంటుంది. కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

వాహనాలపై కులాలకు సంబంధించిన స్టిక్కర్లు ఉండడం వల్ల డ్రైవర్లు, రైడర్ల దృష్టి మళ్లుతుందని, దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలుపుతున్నారు. ఈ స్టిక్కర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు యోగి సర్కార్ చెబుతుంది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా స్టిక్కర్లు అంటించుకున్న వాహనాలపై యూపీ సర్కార్ గత పదిరోజుల్లోనే 1542 చలానాలు విధించింది. దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఘజియాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రామానంద్ ఖుష్వాహా వెల్లడించారు.

ఒకవేళ ఈ స్టిక్కర్లు వాహనాలపై ఉంటే వారికి వెయ్యి రూపాయలు జరిమానా, నంబర్ ప్లేట్స్ పై ఉంటే ఏకంగా రూ. 5వేల పెనాల్టీ కట్టాల్సిందే. మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. నంబర్ ప్లేట్ మీద వాహనం నంబర్ మాత్రమే ఉండాలి. వేరే ఏ రాతలు ఉన్నా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కులాల, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు వాహనాలకు అతికిస్తే మన దగ్గర కూడా అలాగే చర్యలు తీసుకోవాలి. ఇటాంటి డ్రైవ్ చేపడితే.. ట్రాఫిక్ పోలీసులకు కాసుల పంట పండినట్లే.