టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ, నాగచైతన్యతో..

సీక్రెట్ ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల వీరిద్దరూ కలిసున్న ఫోటో కూడా బయటికి వచ్చి వైరల్ అయ్యింది.

తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పేరు చెబుతూ ఒక పోస్ట్ వేయగా అది వైరల్ అవుతుంది.

సమంతను పెళ్లి మండపంలో చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాను అంటూ శోభిత రాసుకొచ్చింది.

విషయం ఏంటంటే.. శోభిత సిస్టర్ పేరు కూడా 'సమంత'.

శోభిత సిస్టర్ మ్యారేజ్ వైజాగ్ జరుగుతుంది. ఆ పనులు అన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది.

ఈ క్రమంలోనే శోభిత తన చెల్లి సమంత గురించి పోస్ట్ వేసింది.