Weather Update: తెలంగాణలో మండిపోనున్న ఎండలు.. ఏపీలో భిన్నమైన వాతావరణం.. హెచ్చరికలు జారీ

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 01:09 PM

Weather Update: తెలంగాణలో మండిపోనున్న ఎండలు.. ఏపీలో భిన్నమైన వాతావరణం.. హెచ్చరికలు జారీ

Weather Update: దక్షణాదిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ మహానగరం కాస్త చల్లని వాతావరణం ఉంటుందని పేరు. కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు చూస్తే ఎవడ్రా ఇది చెప్పింది అని అనేక మానరు. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఎండలు మాడు పగిలేలా దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతుంటే మరో నాలుగు రోజులపాటు ఎండలు మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నేటి నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు తెలిపింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఏప్రిల్ మూడో తేదీ నుండి మరో రెండు డిగ్రీలు పెరగనున్నట్లు వాతావరణశాఖ సూచించింది.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ అధికారులు ఎల్లో రంగు హెచ్చరికను వాతావరణశాఖ జారీ చేశారు. ఆయా జిల్లాలో వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకి వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ సూచించింది.