ఈ బియ్యం ఆరోగ్యానికి వరం! కిలో రూ.500! ఏంటి స్పెషల్?

Kaburulu

Kaburulu Desk

April 1, 2024 | 12:53 PM

ఈ బియ్యం ఆరోగ్యానికి వరం! కిలో రూ.500! ఏంటి స్పెషల్?

మాములుగా ఓ మధ్య తరగతి కుటుంబం తినే రైస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 40 రూపాయల నుండి 60 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ.. రైస్ కాస్ట్ కిలో 500 ఉంటే? ఏంటి అంత ఉంటుందా అని షాక్ కి గురయ్యారా? అవును.. ఈ బ్లాక్ రైస్ ధర అక్షరాల కిలో రూ.500! మరి.. అంతగా ఈ రైస్ లో ప్రత్యేకత ఏముంది? ఇంత ఎక్కువ ధర ఉన్న బ్లాక్ రైస్ ఇటు ప్రజలకి, అటు రైతులకి ఎలా మేలు చేస్తుంది? ఈ విషయాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవికాలం అయిపోగానే అన్నదాతలు తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తూ దుక్కి దున్ని పెడతారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసి వరి వగడాలను ఎంపిక చేసుకుంటున్నారు. జూన్ నెలలో బుుతుపవనాలు మొదలవగానే వరి సాగు మొదలుపెడతారు. అయితే సాధారణంగా మనదేశంలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో వరి పండిస్తారు. వరి వంగడాల్లో ‘బ్లాక్ రైస్’ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఆరోగ్యపరంగా, రైతుకు ఆర్థికపరంగా మేలైన రకం ఈ నల్లబియ్యం అని చెప్పవచ్చు. ఈ నల్లబియ్యం గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

నల్లబియ్యానికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇందులో షోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండడంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఈ రైస్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన బీపీ, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. బ్లాక్‌రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.ఇక ఆదాయానికి వస్తే మార్కెట్ లో సాధారణ బియ్యనికి ఉండే ధరకన్న బాస్మతి బియ్యానికి ఎక్కువ ధర ఉంటుంది. కానీ బాస్మతి బియ్యం కన్న నల్లబియ్యం ధర ఎక్కువ.ఒక హెక్టారు సాగుతో లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు.

నల్లబియ్యం సాగు మొదట చైనాలో మొదలైంది. తర్వాత భారతదేశంలో మణిపూర్, అస్సాంలో సాగు ప్రారంభించారు. క్రమంగా ఈశాన్య రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా పండిస్తున్నారు.ప్రస్తుతం ఆంధ్రపదేశ్, తెలంగాణ ఖమ్మం జిల్లాలో కూడా రైతులు నల్లబియ్యం పండిస్తున్నారు. ఇది కూడా సాధారణ వరిలానే పండిస్తారు. నల్లవరి సాగు ప్రారంభించిన తర్వాత 100 నుండి 110 రోజులలో పంట చేతికి అందుతుంది.నల్ల వరి పొడవుగా ఉంటుంది. వండిన తర్వాత అన్నం బ్లూ కలర్ లోకి మారుతుంది.వీటి ధర కిలోకు రూ.250 నుండి రూ.500 వరకు ఉంటుంది. ఆరోగ్యానికి మేలైన నల్ల బియ్యం సాగుపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.