Home » devotional
శ్రీశైలంలో ఈనెల 11 న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ, పోలీస్, ఆర్టీసి అధికారులతో ఆలయ ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. 11 న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామన్నారు. అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతుబలి నిషేధానికి […]
చైత్ర మాసం పౌర్ణమిని హనుమాన్ జయంతిగా హిందూ బంధువులు భావిస్తూ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిథి రోజున హనుమంతుడి పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శక్తికి మూలంగా భావించే హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం. మానవ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా భక్తి , విశ్వాసంతో వాయు నందనుడు హనుమంతుడిని పూజిస్తే .. ఆ భక్తుడిని రక్షిస్తాడని నమ్మకం. హనుమంతుడి జయంతిని భక్తులు పవిత్రంగా జరుపుకుంటారు. హనుమాన్ ఆరాధనతో […]
ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని హిందువుల నమ్మకం. అసలు దేశంలో రామాలయం లేని ఊరు దాదాపు కనిపించదంటే అతిశయోక్తి కాదు.. రాముడు.. రామ భక్తుడు హనుమంతుడు హిందువులకు అత్యంత ఇష్టమైన దేవుళ్ళు.. రామ నామం జపిస్తే చాలు.. హనుమంతుడు ప్రసన్నమవుతాడని.. ఆధ్యాత్మిక గ్రంథాల ఉవాచ. అందుకనే అంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా రామ భక్తులై ఉండాలని.. అప్పుడే విశేషమైన ఫలితాలను వస్తాయని అంటారు. జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీరామ […]
రేపటి నుండి ఏప్రిల్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో కొన్ని ప్రధానమైన వ్రతాలు మరియు పండుగలు రానున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. తర్వాత నుంచి వైశాఖ మాసం ప్రారంభం కానుంది. వచ్చే నెలలో హనుమాన్ జన్మోత్సవ్, కామద ఏకాదశి, వరుథిని ఏకాదశి, అక్షయ తృతీయ, పరశురామ జయంతి మరియు సీతా నవమి వంటి అనేక ప్రధాన పండుగలు రానున్నాయి. ఏప్రిల్ నెలలో వచ్చే ఫెస్టివల్స్ గురించి తెలుసుకోండి. […]
శ్రీరామనవమి సందర్భంగా రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది. శ్రీరాముడి పవిత్ర నగరమైన అయోధ్యలో రామ నవమి సందర్భంగా అయోధ్యను సందర్శించే భక్తులు, పర్యాటకులు, అతిథులను హెలికాప్టర్‌లో శ్రీరాముడికి సంబంధించిన ప్రదేశాలకు తీసుకువెళతారు. దీనికి సంబంధించిన వివరాలేమిటో ఇపుడు తెలుకుందాం…! రాములవారి జన్మస్థానమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణమౌతున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ఆలయాన్ని, ఇంకా చుట్టూ ఉన్నటువంటి రాముడేలిన రాజ్యాన్ని, ఇతర పర్యాటక ప్రదేశాలన్నింటినీ చుట్టేసి రావడానికి ఒక చక్కటి అవకాశం మన ముందు […]
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ చైర్మన్ […]
222 తులాల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు, పచ్చలు ఇతర విలువైన రత్నాలతో తయారు చేయబడిన ఈ రామాయణాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీ రామ నవమి సందర్భంగా ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. తర్వాత దీనిని తిరిగి బ్యాంకులో ఉంచుతారు. మరి ఈ రామాయణం ఎవరు రచించారు? దాని ప్రత్యేకతలేమిటి వంటి విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం. రామాయణం సనాతన హిందూ ధర్మంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప గ్రంథంగా ప్రపంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. వాల్మీకి […]
రామనవమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా రాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాముడికి కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా రామ జన్మ భూమి ఆయోధ్యలోనైతే కన్నుల పండవగా వేడుకలు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు మార్చి నెలలో వారం పాటు నిర్వహిస్తారు. ఇక ఈసారి అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ నవమి మహోత్సవాన్ని ఈ నెల 21 నుంచి […]
తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసి, భక్తులను అలర్ట్ చేసింది… ఏప్రిల్ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను ఈనెల 27వ తేదీన (ఎల్లుండి) విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని […]
గత 20 సంవత్సరాల నుండి భక్తులు భద్రాద్రి సీతారాముల కళ్యాణ ఉత్సవానికి తలంబ్రాలను గోటితో వలచి పాదయాత్రగా వెళ్ళి సమర్పిస్తారు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఏర్పాట్లు చేశారో… అసలు ఆ భక్తులు ఏ ప్రాంతం వారో ఇపుడు తెలుసుకుందాం. భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ఈ నెల 30న భద్రాచలంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పది గ్రమాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ […]