Car Dent: సూపర్ ట్రిక్స్.. వీటితో మీ కారు డెంట్ ని ఇంట్లోనే పోగొట్టొచ్చు!

Kaburulu

Kaburulu Desk

April 1, 2024 | 12:44 PM

Car Dent: సూపర్ ట్రిక్స్.. వీటితో మీ కారు డెంట్ ని ఇంట్లోనే పోగొట్టొచ్చు!

కారు యజమానులు ఒకసారి ఇంటి నుంచి బయటకు వస్తే.. మళ్లీ తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా, జాగ్రత్తగా వెళ్తామనే నమ్మకం ఉండదు. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్, అతివేగం, నిర్లక్ష్యం.. ఇలా కారణంగా ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా కూడా మీ కారుకి డెంట్లు పడచ్చు. అలా డెంట్ తీయించేందుకు గరాజ్ కి వెళ్తే వాళ్లు భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తారు. అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్న డెంట్లను మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. అందుకు కొన్ని ట్రిక్స్‌, ఎక్విప్మెంట్‌ కూడా ఉంది. మరి.. వాటిని ఎలా రిపేర్‌ చేయాలి? నిజంగానే ఇంట్లో బాగు చేసుకోవచ్చా? ఇప్పుడు చూద్దాం.

మినీ డెంట్ రిమూవర్:

మీ కారు బంపర్‌, సైడ్‌ బాడీకి చిన్న చిన్న డెంట్లు పడితే.. ఈ మినీ డెంట్ రిమూవర్ తో రిపేర్‌ చేయవచ్చు. ఇది పెద్ద కష్టం కడా కాదు. డెంట్‌ పడిన దగ్గర కొంచెం వేడి నీళ్లు పోసి ఆ తర్వాత ఈ మినీ డెంట్ రిమూవర్‌ ని పెట్టాలి. దానికి ఒక లాక్ ఉంటుంది. దానిని లాక్ చేయగానే అది ఒక వాక్యూమ్‌ లాక్‌ లా అయిపోతుంది. అప్పుడు మీరు దానిని హ్యాండిల్‌ పట్టుకుని బలంగా లాగితే ఆ డెంట్‌ బయటకు వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల పెద్దగా స్ర్కాచెస్ కూడా పడవు. ఈ మినీ డెంట్ రిమూవర్‌ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హాట్ గ్లూ- బాటిల్‌:

మీరు ఇంట్లోనే ఏదైనా తయారు చేసేందుకు, హోం క్రాఫ్ట్స్ కోసం ఈ హాట్‌ గ్లూని వాడుతూ ఉంటారు. అయితే ఈ హాట్‌ గ్లూతోనే మీ కారు డెంట్ ని కూడా రిమూవ్ చేయచ్చు. హాట్‌ గ్లూ గన్ తో ఒక బాటిల్‌ క్యాప్‌ కి గ్లూ అంటించాలి. ఆ క్యాప్‌ ని డెంట్‌ మేజర్‌ పార్ట్ దగ్గర అంటించాలి. ఆ తర్వాత దానికి బాటిల్ ని జతచేసి గట్టిగా వెనక్కి లాగాలి. అలా చేయడం వల్ల డెంట్ పోతుంది. ఒకటి, రెండుసార్లు ప్రయత్నించవచ్చు. దాదాపుగా ఇది వర్క్ అవుతుంది. ఈ హాట్ గ్లూ గన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సిలికాన్ స్టిక్స్:

గ్లూ గన్- బాటిల్‌ తరహాలోనే ఈ సిలికాన్ స్టిక్స్ కూడా పని చేస్తాయి. ఆన్ లైన్ లో సిలికాన్ స్టిక్స్‌ అని ఉంటాయి. అవి ఒక మూడు నాలుగు తీసుకుని చివర్ల వేడి చేసి డెంట్‌ పార్ట్ లో అంటించాలి. అది ఆరిన తర్వాత గట్టిగా వెనక్కి లాగాలి. దీని వల్ల ఒక 50 శాతం వరకు డెంట్ ని పోగెట్టేందుకు వీలుంటుంది. అయితే వంద శాతం పని చేస్తుందని ఎవరూ చెప్పలేదు. ఈ సిలికాన్ స్టిక్స్‌ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సెల్లో టేప్:

సెల్లో టేప్ ద్వారా కారు డోర్‌ చొట్టలను తేలిగ్గా తీసేయవచ్చు. మీరు సాధారణంగా సెల్లో టేమ్ చిన్నది వాడుంటారు. కానీ, అందులో పెద్ద సెల్లో టేప్ ఉంటుంది. దానిని మొదటి డోర్ మీద నిలువుగా రెండుసార్లు వేయాలి. దాని మీద అడ్డంగా సెల్లో టేప్ ని అంట్టించుకుంటూ రావాలి. అలా అంటించిన తర్వాత నిలువగా అంటించిన టేపుని గట్టిగా లాగాలి. అలా లాగే క్రమంలో కారు డోర్ డెంట్ కూడా వచ్చేస్తుంది. దీని ద్వారా కారు డోర్ కి ఎలాంటి గీతలు కూడా పడవు.

హాట్ వాటర్:

ఇప్పుడు చెప్పుకున్న ట్రిక్స్ ఇదే ఎంతో సులభమైనది. ఇది ముఖ్యంగా ఫైబర్‌ బంపర్లకు ఉపయోగపడుతుంది. ముందు, వెనుక భాగంలో ఉండే ఫైబర్‌ బంపర్‌ కి చొట్టలు పడితే బాగా మరిగే వేడి నీళ్లను ఆ డెంట్ మీద పోయాలి. అలా పోసిన తర్వాత కాస్త వేడి తగ్గుతున్న సమయంలోనే జాగ్రత్తగా లోపలి పక్క నుంచి బయటకు నెట్టచ్చు. సింక్ ప్లంజర్ సాయంతో కూడా డెంట్ ని బయటకు లాగచ్చు. ఫైబర్‌ కాస్త మెత్తగా ఉండటం వల్ల వెంటనే బయటకు వస్తుంది. దీని వల్ల గీతలు కూడా ఏమీ పడవు. కానీ, వేడినీళ్లు పోసే సమయంలో చిన్న పిల్లలు దగ్గర లేకుండా, పోసే వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాస్తో కూస్తో అనుభవం లేకుండా ఇవేమీ ఇంట్లో ప్రయత్నించకుండా ఉంటేనే మంచిది.