Home » devotional
ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భాగంగా మనదేశం నుండి స్వామి వివేకానంద చికాగో సభలో హాజరయిన విషయం అందరికి తెలిసిందే. కానీ అక్కడ వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం ద్వారా చాలామంది ప్రజలు ఆకర్షణకు గురై సన్నిహితులుగా మారారు. అక్కడి ప్రజలు కొందరు హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకొని దేవాలయాలు నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. అటువంటి దేవాలయాల్లో ఒకటైన చికాగో రామాలయం విశేషాలను గురించి ఇపుడు తెలుసుకుందాం. ఇల్లినాయిస్ రాష్ట్రంలోలోని లెమోంట్లోలో ఉన్న చికాగో రామాలయంను 1977లో స్థాపించారు. దేవాలయ […]
హిందూ దేవాలయాలకు, హిందూ మతానికి భారతదేశం అతి పెద్ద దేశం అని చాలా మంది ప్రజలు అనుకుంటారు. హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారన్న మాట వాస్తవమే, ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శన ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయమైన అంగ్ కోర్ వాట్ దేవాలయం మాత్రం కాంబోడియా నగరంలో ఉంది. దాని […]
సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఒకటి చాయా సోమేశ్వర దేవాలయం. ఈ ఆలయ సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ […]
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయం 2021 జులై 25న ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. […]
భారతదేశంలో ఉన్న ప్రతీ దేవాలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలే ఆ ఆలయాలు ప్రసిద్ధం అవడానికి కారణం అవుతాయి. అందులో ఉన్న ఒకానొక ప్రత్యేకత కలిగిఉన్న ఆలయమే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గల పండరీపూర్ విఠలనాథ ఆలయం. ఇక్కడి ఆలయంలో కొలువుతీరిన విఠలేశ్వరుడి విగ్రహం ఇటుకలపై నిలబడి ఉంటుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే అక్షరాలా నిజం. మరి ఈ ఆలయం ఎక్కడుందో ఇంకా ఆ ఆలయ విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం. శ్రీమహా […]
సనాతన హిందూ సాంప్రదాయంలో ప్రత్యక్ష దేవతలైన సూర్య చంద్రులకు ప్రత్యేక స్థానం ఉంది. మరి ప్రత్యేకంగా సంక్రాంతి నాడు సూర్యుడు మాకరాశిలోకి ప్రవేశించే సందర్భంగా సంధ్యావందనాలు, పూజా కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మరి నిరంతరం ప్రకాశించే సూర్య భగవానుడికి కూడా ఒక ప్రత్యేకమైన ఆలయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇపుడు ఆలయం ఎక్కడుందో దాని ప్రత్యేకత ఏమిటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం. చూడటానికి రథం ఆకారంలో నిర్మించబడిన కోణార్క సూర్యదేవాలయం, ఒడిషాలో ఎర్ర […]
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా కోడి పందేలు విపరీతంగా నిర్వహిస్తారు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి ఉంది. శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు. కానీ మరి ఈ కోడి పందేలను ప్రభుత్వం చట్టపరంగా నిషేధించి. అక్రమ రవాణా, జంతుబలి, అక్రమ డబ్బు సంపాదన వంటివి దీనికి కారణం. […]
సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలకు భారతదేశం పుట్టినిల్లు వంటిది. మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగ దాని యొక్క సొంత ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. చాలా పండుగలను ఏడాది పొడవునా భారతదేశంలోని ప్రజలు జరుపుకుంటారు, ఆ పండుగల యొక్క ప్రాముఖ్యతను, ఆ పండుగల నుండి మనకు కలిగే లాభాలను మనము కోల్పోకూడదనేదే ఆయా పండుగలను మనం క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ ఉంటాం. మరి అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగనాడు పొంగల్ ను ఎందుకు తయారు […]
ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడోరోజునే కనుమ పండుగ జరుపుకుంటాం. ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు. ఈరోజు అంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం. మరి ఇంత ప్రీతికరమైన పండుగ వెనక ఉన్న చరిత్ర ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఆ రోజు నిర్వహించుకునే ఆచారాలు ఏమిటి, సంప్రదాయాలు ఏమిటి, వాటి వెనక ఉన్న శాష్ట్రీయపరమైన కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ పండగల వెనక ఉన్న వివిధ విషయాలను […]
సంక్రాంతి పండగ అనగానే ముందుగా పిల్లలకు, పెద్దలకు అందరికీ గుర్తొచ్చేది గాలిపటాల సంబరాలు. పిల్లలందరూ పెద్దలతో కలిసి గాలిపటాలు ఎగురవేసేందుకు ఉత్సాహపడతారు. మన పెద్దలు ఏ ఆచారాన్ని పాటించినా, ఏ సంస్కృతిని ఆచరించినా దాని వెనక ఏదో ఒక ఆధ్యాత్మికపరమైన కారణం, శాస్త్రీయపరమైన కారణం ఉంటుంది. అయితే పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో, సాంప్రదాయపరమైన కారణాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరం జనవరి 14 […]