Ramalayam in chicago: చికాగోలో ఉన్న రామమందిరం విశేషాలేమోటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 08:34 AM

Ramalayam in chicago: చికాగోలో ఉన్న రామమందిరం విశేషాలేమోటో తెలుసా…?

ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భాగంగా మనదేశం నుండి స్వామి వివేకానంద చికాగో సభలో హాజరయిన విషయం అందరికి తెలిసిందే. కానీ అక్కడ వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం ద్వారా చాలామంది ప్రజలు ఆకర్షణకు గురై సన్నిహితులుగా మారారు. అక్కడి ప్రజలు కొందరు హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకొని దేవాలయాలు నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. అటువంటి దేవాలయాల్లో ఒకటైన చికాగో రామాలయం విశేషాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోలోని లెమోంట్లోలో ఉన్న చికాగో రామాలయంను 1977లో స్థాపించారు. దేవాలయ ప్రాంగణంలోని వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రానికి ఆనుకుని ఉన్న కొండకు “వివేకానంద కొండ” అని పేరు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో పాల్గొన్న తరువాత తీసిన వివేకానంద ఛాయాచిత్రం ఆధారంగా 10 అడుగుల ఎత్తైన వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఈ ఆలయంలో నిర్మించారు. ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పబ్లిక్ స్థలంలో స్థాపించబడిన మొదటి వివేకానంద విగ్రహంగా ప్రసిద్ధి చెందింది.
ఈ దేవాలయంలో శ్రీరామనవమి, మహాశివరాత్రి, శ్రీకృష్ణజన్మాష్టమి, దీపావళి, నవరాత్రి, దసరా, హోలీ, వినాయక చవితి, మకర సంక్రాంతి వంటి పండుగలను అత్యంత శోభాయమానంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి (1986, 1998, 2007, 2019) కుంభాభిషేకం కూడా నిర్వహించబడుతుంది. 2010లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన శ్రీశ్రీ రవిశంకర్ స్వామి ఇక్కడ వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాడు. 2011 సంవత్సరంలో, జూన్ నెలలో శ్రీరామ మందిర నిర్మాణ 25 సంవత్సరాల వేడుక ఘనంగా నిర్వహించబడింది.

దేవాలయ సముదాయంలో రామాలయం, గణేశ-శివ-దుర్గ దేవాలయం, కమ్యూనిటీ సెంటర్, వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రం అనే నాలుగు భవనాలు కుడా ఉన్నాయి. చోళ రాజవంశం (10వ శతాబ్దపు భారతీయ రాజుల రాజవంశం) కాలంలోని శైలికి అనుగుణంగా ప్రామాణికమైన శైలిలో రామ మందిరం నిర్మించబడింది. దీనికి 80 అడుగుల ఎత్తు గోపురం ఉంది ఇది హిందూ ఆత్మకు శక్తివంతమైన చిహ్నంగా పేరుగాంచింది. ఈ దేవాలయం కిందనున్న పెద్ద హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యాలు ఉన్నాయి. రామాలయానికి ఉత్తరం వైపు కళింగ రాజవంశం శైలిలో గణేశ-శివ-దుర్గ దేవాలయం కూడా ఉంది.