Home » devotional
సంక్రాంతి వస్తుంది అనగానే వీధులన్నీ అందమైన రంగవల్లులతో నిండిపోతాయి. పాతకాలంలో ముగ్గును బియ్యం పిండి తోనే వేసేవారు. కానీ ఇప్పుడు ఏవైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే..........
సంక్రాంతి పండుగ కంటే ముందు నుండే ఇంటిముందు ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ధనుర్మాసం నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేసుకోవాలి. రోజూ ఉదయం పూట ముగ్గులు............
సంక్రాంతి పండుగ అనగానే గాలిపటాలు, గంగిరెద్దులాటలు, ముగ్గులు వంటివి గుర్తొస్తాయి. మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నువ్వులు, బెల్లం ముక్కలను మిక్స్ చేసి స్నేహితులు, బందువులకు పంచి సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండగ రోజున రైతులు పండించిన ధాన్యాన్ని, చెరకును పక్కవాళ్లకు పంచడం ఆనవాయితీ. అంతే కాకుండా నువ్వుల బెల్లం పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకోవడానికి సంక్రాంతిని చిహ్నంగా కూడా భావిస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే… […]
ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి ఉత్సవాలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ అనేవి ప్రత్యేకమైనవి అయితే ఈ మూడు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచేవి మాత్రం ఇంటి ఆడపడచులు తమ ఇళ్ల ముందు వేసుకునే ముగ్గులే. ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టల తళుకులు, వంటివి పండగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఈ పండగ వాతావరణంలో ఎంతో ఆకర్షణగా నిలిచే ఈ ముగ్గుల ప్రత్యేకత ఏమిటో, అసలు రంగోలి జరుపుకునే సంప్రదాయం ఏవిధంగా వచ్చిందో ఇపుడు తెలుసుకుందాం. […]
యజమాని ఏది చెబితే అది నిష్టగా చేస్తూ, అందరినీ అలరిస్తూ, ఆకర్షిస్తున్న కళనే ఈ గంగిరెద్దులాట. అమ్మగారికీ దండం బెట్టు.. అయ్యగారికీ దండం బెట్టు.. మునసబు గారికి దండం బెట్టూ.. కరణం గారికి దండం బెట్టూ.. రారా బసవన్నా, రారా బసవన్నా అంటూ యజమాని చెబుతూ ఉంటే.. ఆ గంగిరెద్దులు తల ఊపుతుంటే.. ఆ ఊరంతా సంబరంగా ఉంటుంది. ఊర్లోని పిల్లలు పెద్దలు ఆ గంగిరెద్దుల వెంట వెళ్తూ ఎంతో సరదాగా, సంతోషంగా గెంతుతూ తమ జీవితాలను […]
సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తున్న ఆచారం. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని […]
భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఏ పండుగ జరుపుకున్నా, ఏ ఉత్సవం జరుపుకున్నా దాని వెనక ఆధ్యాతిక కారణాలతో పాటు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉంటాయి. మరి సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి పండుగనాడు ఇంట్లోని చిన్నపిల్లల తలపై రేగుపళ్లను పోసి ఉత్సవం జరుపుకుంటారు.. మరి దీని వెనక ఉన్న పురాణ కథ ఏమిటో, ఆధ్యాత్మిక కారణం ఏమిటో, శాస్త్రీయ పరమైన కారణాలేమిటో ఇపుడు చూద్దాం… భోగి పండుగనాడు భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లల తలపై పోస్తారు. […]
సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు వెచ్చదనం కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకుంటారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ […]
నరేంద్ర నాథ్ దత్తగా పిలువబడిన స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడుగా ప్రసిద్ధి చెందాడు. ‘హిందువుగా జీవించు హిందువునని గర్వించు’ అని చాటి చెప్పి, 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడి 161 జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం… వివేకానందుడు గొప్ప […]
మకర సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. అయితే పండుగను ఏ పద్ధతిలో జరుపుకున్నా ప్రయోజనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ఎల్లప్పుడూ జనవరి 14 లేదా 15 న వస్తుంది. ఒక సంవత్సరంలో సూర్యుడు వరుసగా 12 రాశుల గుండా సంచరిస్తాడు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీనిని సూర్య మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. […]