Gobbemmalu : గొబ్బెమ్మలు ఎలా చేయాలి? ఎందుకుచేస్తామో మీకు తెలుసా?

 సంక్రాంతి పండుగ కంటే ముందు నుండే ఇంటిముందు ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ధనుర్మాసం నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేసుకోవాలి. రోజూ ఉదయం పూట ముగ్గులు............

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 08:20 PM

Gobbemmalu : గొబ్బెమ్మలు ఎలా చేయాలి? ఎందుకుచేస్తామో మీకు తెలుసా?

Gobbemmalu :  సంక్రాంతి పండుగ కంటే ముందు నుండే ఇంటిముందు ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ధనుర్మాసం నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు. గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారుచేసుకోవాలి. రోజూ ఉదయం పూట ముగ్గులు వేసిన తరువాత ముగ్గుపై గొబ్బెమ్మలను ఉంచాలి. అదే విధంగా సాయంకాలం సమయంలో కూడా ముగ్గు వేసి గొబ్బెమ్మలను ఉంచుతారు కొంతమంది. సాయంత్రం పూట పెట్టే గొబ్బెమ్మలను సందె గొబ్బెమ్మలు అంటారు.

గొబ్బెమ్మలను ముగ్గులో ఉంచిన తరువాత వాటిని పసుపు, కుంకుమ మరియు పూలతో అలంకరిస్తారు. ఆ తరువాత వాటికీ పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అయితే గొబ్బెమ్మలను ముగ్గుపై ఉంచిన దాని చుట్టూ కన్నెపిల్లలు పాటలు పాడుతూ కృష్ణున్ని ఆరాధిస్తారు. గొబ్బెమ్మలను గోదా దేవిగా పూజిస్తారు. గొబ్బెమ్మలను గోపికలతో కూడా పోలుస్తారు. ఈ ధనుర్మాసంలో కృషుణ్ణి ప్రార్ధించే కంటే ముందు కృష్ణుని భక్తురాలు అయిన గోపికలను తలచుకోవాలి అనే ఉద్దేశ్యంతో గొబ్బెమ్మలకు పూజ చేస్తారు.

పండగల సమయంలో ఇంటిలోని ఆడపడుచులందరూ వస్తారు. ఇల్లు ఎంతో కళకళలాడుతుంది. ఇంకా తెలిసిన వారిని కూడా ఇంటికి పిలుస్తారు. ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను ఉంచడం ద్వారా లక్ష్మి దేవిని మన ఇంటికి రమ్మని ఆహ్వానించినట్లు. అదేవిధంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో ఎందుకు చేస్తారంటే ఆవు పేడలో ఉండే మంచి బాక్టీరియా ఇంటిలో ఉండే చెడు బాక్టీరియా ను అంతం చేస్తుంది. బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియాని లోపలి రానీయకుండా చేస్తుంది.

Mehndi : పండగకి గోరింటాకు పెట్టుకుంటున్నారా?? బాగా పండాలంటే ఇలా చేయండి..

గొబ్బెమ్మల పేరంటకం చేసిన తరువాత వచ్చిన వారందరికీ ప్రసాదం పెట్టి తరువాత తాంబూలం ఇవ్వాలి. ముందుగా కన్నె పిల్లలకు, చిన్న పిల్లలకు ఇచ్చిన తరువాత మిగతా అందరికి తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా ధనుర్మాసం నెల రోజులు జరుపుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ పండుగ మూడు రోజులు మాత్రమే గొబ్బెమ్మలకు పూజ చేస్తున్నారు. గొబ్బెమ్మలను తరువాత ఎండలో పెట్టి ఆ పిడకలతో భోగి పండుగ నాడు ఉదయం పూట మంటలు వేసేవారు. ఈ విధంగా గొబ్బెమ్మలకు కూడా మన పండుగలలో ప్రాముఖ్యత ఉంది.