Importance of Makar Sankranthi: మకర సంక్రాంతి మాహాత్మ్యం తెలుసా…!

మకర సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. అయితే పండుగను ఏ పద్ధతిలో జరుపుకున్నా ప్రయోజనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ఎల్లప్పుడూ జనవరి 14 లేదా 15 న వస్తుంది. ఒక సంవత్సరంలో సూర్యుడు వరుసగా 12 రాశుల గుండా సంచరిస్తాడు. జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీనిని సూర్య మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున పుణ్యనదులలో స్నానం చేసి నువ్వులు, బెల్లం, చెరకు, శెనగపప్పు, నువ్వుల లడ్డూ, బియ్యం, కూరగాయలు, పప్పులు దానం చేసే సంప్రదాయం ఉంది.
మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్‌లలో ఖిచ్డీని మకర సంక్రాంతి రోజున తయారు చేసి తింటారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి మకర సంక్రాంతి నాడు కిచ్డీని సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ రోజు నుండి ప్రయాగ్‌రాజ్‌లో మాఘమేళా నిర్వహించబడుతుంది. మకర సంక్రాంతిని మాఘి అని కూడా అంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి స్నానానికి వస్తుంటారు.
ఆంధ్ర, తెలంగాణలో భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజులు పండగ జరుపుకుంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే పశువులను పూజిస్తారు. ఎడ్ల పందాలు, కోడి పందేలు చాలా ప్రాచుర్యం పొందాయి. లోహ్రి(Lohri) పంజాబ్, ఢిల్లీ మరియు హర్యానాతో సహా కొన్ని ఇతర ప్రదేశాలలో, లోహ్రీని మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు నువ్వులు, బెల్లం ఎందుకు ఉపయోగిస్తారు? శాస్త్రీయ కారణం ఏంటంటే…. బెల్లం కలిపిన నువ్వులు తినటం ద్వారా అది ఒక ఔషధంగా పని చేసి, ఒంట్లోని చల్లదనాన్ని నివారించి వెచ్చదనాన్ని పెంచుతుంది.. చలి ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో బెల్లం కలిపిన నువ్వుఇటూ తినటం ద్వారా శరీరం కొంత ఆరోగ్యకరంగా ఉంటుందని కూడా శాస్త్రీయపరమైన ఆధారాలు చెబుతున్నాయి.