Home » devotional
శ్రీవారి దర్శనార్థం తిరుపతి వెళ్ళే భక్తులు, అక్కడ సమయానికి స్వామి దర్శనం ముగించుకొని, చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పరిసరాలను, ప్రకృతి అందాలను చూడాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది భక్తులు తిరుమలలో టిటిడి వారు ఏర్పాటు చేసిన గదులలో వసతి ఏర్పర్చుకుంటారు. ఈ గదుల ధరలు మొన్నటివరకు చాలా చవక ధరలో ఉండేవి. కానీ తాజా వార్తల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన సమాచారం మేరకు తిరుమలలో బస చేయడానికి ఏర్పాటు చేసిన గదుల ధరలు […]
దేవాలయానికి వెళ్ళేటపుడు ఎత్తైన గాలి గోపురం గుండా ప్రవేశించి, ప్రాకార ప్రదేశంలో నడిచి ధ్వజ స్తంభం, బలిపీఠం, మహా మంటపం వంటి వాటిని అన్నింటిని దాటుకుంటూ చివరగా ఉన్న మూల విరాట్టును దర్శించుకుంటాం. మరి దేవాలయంలోని ప్రతి ఒక్క భాగం ఏదో ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందనేది అక్షరాల నిజం. మరి అటువంటి దేవాలయాల భాగాలలో ఒకటైన ఆలయ గాలి గోపురం గురించి ఇపుడు తెలుసుకుందాం. గోపురం అన్న పదానికి సంస్కృత అర్థం ఏమిటంటే గోవు + […]
హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి ఇంటి కడపకు పసుపు రాసి, కుంకుమ పెట్టడం ఒక ఆచారంగా భావిస్తారు. మన పూర్వీకులు ఏదో ఒక పనిని ఆచారంగా మొదలుపెడితే దాని వెనక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. అది ఆధ్యాత్మిక పరమైనదిగా లేదా శాస్త్రీయపరమైనదిగా అయినా అయి ఉండొచ్చు. మరి ఇలా ఇంటి గుమ్మానికి పసుపు రాయడం వెనక ఉన్న కారణాలేమిటో తెలుసుకున్నారా… అయితే ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి…. సాధారణంగా కొందరు గడపకు పసుపు రాసి […]
సనాతన హిందూధర్మంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు తప్పకుండా టెంకాయ కొట్టి దైవ దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా భక్తితో కొబ్బరి కొట్టడం కూడా సాధారణమైపోయింది. టెంకాయను మనిషితో పోల్చవచ్చు కూడా. అదెలానో, కొబ్బరికాయ కొట్టడం వెనక ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మన భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. భారత ప్రజలు సంస్కృతి సంప్రదాయలకు ఎంతో గౌరవం ఇస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుడిని […]
శుభకార్యాలు, పండుగలు, పూజలు ఎక్కడ జరిగినా మామిడి ఆకులను కట్టి మొదలుపెట్టడం ఒక సంప్రదాయకపరమైన ఆచారంగా మనం భావిస్తాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఏ ఆచరణ చేపట్టినా, ఏ పద్ధతి పాటించినా దాని వెనక ఏదో ఒక శాస్త్రీయపరమైన కారణం తప్పక ఉంటుంది. మరి ఈ మామిడాకులు కట్టడం వెనక ఉన్న శాస్త్రీయపరమైన, ఆధ్యాత్మికపరమైన కారణాలేమితో ఇపుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే, మామిడి హనుమంతుడికి ఇష్టమైన పండు. ఎక్కడ చూసినా మామిడి ఆకులను పూజకు ఉపయోగిస్తారు. […]
వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు వైకుంఠ ఏకాదశినాడు నిర్వహిస్తారు. మరి ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటో, ఈ పర్వదినం యొక్క చరిత్ర ఏంటో ఇపుడు తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి […]
సకల సంపదలకు నిలయమైన మన భారతదేశాన్ని విశ్వగురువుగా భావిస్తూ, మన దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తూ భారతమాతగా పిలుచుకుంటాం. మరి ఈ భారతమాతకు కూడా ఒక దేవాలయం ఉందని, ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయని తెలుసా…? అయితే ఆలస్యం చేయకుండా ఈ వ్యాసం చదివి భారతమాత దేవాలయం ఎక్కడుందో, ఆ దేవాలయ విశిష్టత ఏమిటో తెలుసుకోండి…! భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో భారతమాత దేవాలయం ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు […]
శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని టిటిడి స్పష్టం చేసింది. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. […]
ధ్వజస్తంభాన్ని హిందూ దేవాలయాలలో ఒక ప్రధానమైన భాగంగా చెబుతారు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవట. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారట. మరి ఇంతటి విశేషాలున్న ధ్వజస్తంభం చరిత్ర ఏంటో ఇపుడు తెలుసుకుందాం. ప్రస్తుతంకార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి, సాంప్రదాయపరంగా పూజలు చేస్తున్నారు. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో […]
దేవాలయాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. అటువంటి దేవాలయాల్లో కొన్ని మాత్రమే కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందులో ఒకటి త్రిభువనేశ్వరుడు కొలువై ఉన్న ఒడిశాలో గల లింగరాజస్వామి దేవాలయం. ఈ ఆలయం ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్ లో ఉంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో, ఆలయ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇపుడు తెలుసుకుందాం. లింగరాజ అనగా లింగాలకు రాజు అని అర్థం. ఈ ఆలయంలోని శివలింగానికి త్రిభువనేశ్వర అనే పేరు ఉంది. […]