Importance of coconut in tample: దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా….?

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 11:26 PM

Importance of coconut in tample: దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా….?

సనాతన హిందూధర్మంలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు తప్పకుండా టెంకాయ కొట్టి దైవ దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా భక్తితో కొబ్బరి కొట్టడం కూడా సాధారణమైపోయింది. టెంకాయను మనిషితో పోల్చవచ్చు కూడా. అదెలానో, కొబ్బరికాయ కొట్టడం వెనక ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.

మన భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. భారత ప్రజలు సంస్కృతి సంప్రదాయలకు ఎంతో గౌరవం ఇస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో దేవాలయాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. భగవంతుడిని కొలిచేందుకు మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళ్తుంటారు. ఇలా దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ భక్తితో కొబ్బరికాయ కొడతారు. దేవుడికి ధన కనక వస్తువులనో లేదా వారి వారి స్తోమతకు తగినట్లు ఎంతో కొంత సొమ్మునో సమర్పిస్తారు. కొబ్బరికాయే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికి కలుగుతుంది. అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అన్న విషయం చాలామందికి తెలియదు.

హిందూ పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజానికి టెంకాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగుతాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారని పండితులు చెబుతారు.