Thirumala Rooms: తిరుమల వెళ్ళే భక్తులకు భారీ షాక్…!

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 11:00 PM

Thirumala Rooms: తిరుమల వెళ్ళే భక్తులకు భారీ షాక్…!

శ్రీవారి దర్శనార్థం తిరుపతి వెళ్ళే భక్తులు, అక్కడ సమయానికి స్వామి దర్శనం ముగించుకొని, చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పరిసరాలను, ప్రకృతి అందాలను చూడాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది భక్తులు తిరుమలలో టిటిడి వారు ఏర్పాటు చేసిన గదులలో వసతి ఏర్పర్చుకుంటారు. ఈ గదుల ధరలు మొన్నటివరకు చాలా చవక ధరలో ఉండేవి. కానీ తాజా వార్తల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన సమాచారం మేరకు తిరుమలలో బస చేయడానికి ఏర్పాటు చేసిన గదుల ధరలు భారీగా పెరిగాయి. దీని గురించిన మరిన్ని వివరాలు ఇపుడు తెలుసుకుందాం.

తిరుమలలో గదుల ధరలు భారీగా పెంచిన టిటిడి నారాయణగిరి రెస్ట్ హౌస్ 1,2,3 లో గదుల ధరల  ఒక్కోటి రూ.150 గా ఉన్న ఒక్కో గదిని జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచింది. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి జీఎస్టీతో కలిపి రూ.1700 టీటీడీ పెంచింది. నారాయణగిరిలో కార్నర్ షూట్ జీఎస్టీతో కలిపి రూ.2,200 గా ధరను నిర్ణయించింది. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 ఉన్న గదిని జీఎస్టీతో కలిపి రూ. 2200 లకు పెంచింది. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుండి అమలు చేస్తున్నట్లు టిటిడి తెలిపింది.

అన్నీ ఖర్చులు పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవ్వొచ్చు. కాబట్టి తిరుమల వెళ్ళే భక్తులు గదుల ధరలను దృష్టిలో ఉంచుకొని తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టిటిడి వారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఎంతమంది ప్రజలు మద్దతు తెలిపి, ఈ ధరల పెంపును ఆహ్వానిస్తారో లేదా ఎంతమంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరూ తిరుమలకు వెళుతున్నారా అయితే ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి.