Benefits Mango leaves: శుభకార్యాలలో ఇంటి గుమ్మానికి మామిడాకులు ఎందుకు కడతారో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 11:25 PM

Benefits Mango leaves: శుభకార్యాలలో ఇంటి గుమ్మానికి మామిడాకులు ఎందుకు కడతారో తెలుసా…?

శుభకార్యాలు, పండుగలు, పూజలు ఎక్కడ జరిగినా మామిడి ఆకులను కట్టి మొదలుపెట్టడం ఒక సంప్రదాయకపరమైన ఆచారంగా మనం భావిస్తాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఏ ఆచరణ చేపట్టినా, ఏ పద్ధతి పాటించినా దాని వెనక ఏదో ఒక శాస్త్రీయపరమైన కారణం తప్పక ఉంటుంది. మరి ఈ మామిడాకులు కట్టడం వెనక ఉన్న శాస్త్రీయపరమైన, ఆధ్యాత్మికపరమైన కారణాలేమితో ఇపుడు తెలుసుకుందాం.

ఆధ్యాత్మిక దృక్కోణంలో చూస్తే, మామిడి హనుమంతుడికి ఇష్టమైన పండు. ఎక్కడ చూసినా మామిడి ఆకులను పూజకు ఉపయోగిస్తారు. వీటిపై హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఉందని ప్రజల విశ్వాసం. మామిడి తోరణం కడితే ఇంటికి ప్రతికూల శక్తులు ఉండవని, మంచి పనులకు దుష్టశక్తులు అడ్డురావని కూడా ప్రజలు భావిస్తారు. ఇది ప్రతి పనిని విజయవంతం చేస్తుందని. అంతేకాకుండా ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం కారణంగా మామిడి ఆకులను కూడా పూజలో ఉపయోగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక శాస్త్రీయంగా ఆలోచిస్తే మామిడి ఆకులను చెట్టు నుండి వేరు చేశాక కూడా 24 గంటలవరకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఇలా పండుగలు, వివిధ శుభకార్యాల సమయాల్లో ఎక్కువమంది ప్రజలు ఒకే దగ్గర గుమిగూడటం జరుగుతుంది. ఆ ప్రదేశంలో పీల్చేగాలి స్వచ్ఛంగా ఉండటం కోసం చెట్టు నుండి వేరు చేసినా ఆక్సిజన్ ను అందించే మామిడాకును ఉపయోగిస్తారు. ఇలానే ప్రతి ఇంటిముందూ తులసి మొక్క ఉండటానికి కూడా ఇదే శాస్త్రీయపరమైన కారణాన్ని చెబుతూ ఉంటారు.