Home » devotional
గుజరాత్ లోని కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే పర్యాటకులకు ఇక్కడ అసలు ఆలయం ఉన్నట్లే కనిపించదు. ఎందుకంటే అదే సమయంలో ఆ దేవాలయం పూర్తిగా సముద్రంలో మునిగి, మధ్యలో ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటల నుండి సముద్రం నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. ఈ ఆటుపోటుల కారణంగానే భక్తులు ఆలయానికి చేరుకునేందుకు, నీటిలో మునిగేందుకు కారణం అవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో […]
విజయనగర సామ్రాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కట్టడాలు నేటికీ కర్ణాటకలోని హంపి నగరంలో కనిపిస్తాయి. ఇక్కడి విష్ణుమూర్తి దేవాలయం హంపీకి వెళ్ళే భక్తులను ఆలయంలోని అద్భుతమైన కళలను తిలకించేందుకు ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్నే విఠల దేవాలయం అనికూడా అంటారు. ఈ ఆలయంలోని స్తంభాలను ముట్టుకుంటే చాలు స్తంభాలు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ ఆలయం 16వ శతాబ్దం నాటిది. ఇది రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి […]
భూమి మీద బ్రహ్మదేవుడికి ఎక్కడా పూజలు చేయరు కారణం భృగు మహర్షి పెట్టిన శాపం. బ్రహ్మకు ఆలయాలు కూడా ఉండవని పురాణాలు చెబుతున్నాయి. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం, కాశీలో, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లోని ప్రత్యేక ప్రదేశాల్లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. వాటి విశిష్టత ఏంటో ఇపుడు తెలుసుకుందాం. ప్రముఖ బ్రహ్మదేవుడి ఆలయాల్లో చేబ్రోలులో ఉన్న ఆలయం ఒకటి. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ దేవుడి ఆలయాన్నిరెండో కాశీగా పిలుస్తారు. బ్రహ్మకు ప్రత్యేక […]
పంచకేదర్ నాథ్ ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన తుంగనాథ్ ఆలయం ఎత్తైన శివలింగం కలిగిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిది. మహాభారతంలోని పాండవుల వృత్తాంతంలోని ఒక సంఘటన ఇక్కడే జరిగినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయమే అర్జునుడు నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రీ రాముడి యుగంలో కూడా ఒక కథనం ఉంది. ఈ దేవాలయంపై రావణ శిల ఉంది. చంద్ర శిల అని పిలువబడే ఒక చిన్న గుడి కూడా ఇక్కడ ఉంది. ఈ రావణశిల […]
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన దేవాలయాలు. అటువంటి దేవాలయాలలో ఒకటే కర్ణాటకలో అతిపురాతమైన చరిత్ర ఉన్న బేలూరు దేవాలయం. యగాచి నది ఒడ్డున దక్షిణకాశీగా పేరు పొందిన బేలూరు పట్టణం హొయసల రాజులకు రాజధానిగా ఉండేది. ఎన్నో ప్రాచీనమైన, ప్రముఖ దేవాలయాలకు బేలూరు పట్టణం కేంద్రంగా నిలిచింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో గల హొయసల రాజులు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయంలోనే ఈ తిరిగే స్తంభం ఉంది. ఆనాటి రాజుల కళాపోషణకు దేవాలయం […]
శాతవాహనులతో సామంతులుగా ఉండి క్రమంగా స్వతంత్ర్య రాజ్యం ఏర్పర్చుకున్న పల్లవులు అనేక శిల్పసంపదను మనకు అందించారు. పల్లవుల రాజధానిగా పిలువబడే కాంచీపురం ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రంలోని కైలాసనాథ దేవాలయాన్నే పల్లవులు రాతి మీద నిర్మించిన తొలి దేవాలయంగా చెబుతారు. ఈ ఆలయం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఇపుడు తెలుసుకుందాం. పల్లవులు ఈ ఆలయాన్ని క్రీ.శ. 567 వ సంవత్సరంలో నిర్మించారు. ఆ తర్వాత ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రెండో నరసింహ […]
భారతదేశం శిల్పకళా సంపదకు, దేవాలయాలకు పెట్టింది పేరు. మన దేశంలో దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి తంజావూరు. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. ఇక్కడే ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో […]
ఒక స్త్రీని శక్తి రూపంగా భావించి పూజించే సంస్కృతి మన హిందూ సంప్రదాయంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. అందుకే మన పెద్దలు “యత్రనార్యన్తు పూజ్యన్తే రమంతే తత్ర దేవతః” అన్నారు, అంటే స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే అందరు దేవతలూ ప్రసిద్ధులవుతారు అని అర్థం. ఆ శక్తి రూపాన్నే మనం భవానీ, మహాంకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక వంటి ఎన్నో పేర్లతో పూజిస్తాం కానీ అగ్నినే ఒక శక్తిగా, అమ్మవారిగా భావించే ఆలయమొకటుందన్న […]
ఆ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయం, సాయంత్రం గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు తాకుతాయి. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఇక్కడి మూర్తి అభయ ముద్రలో ఉంటాడు. ఆ ఆలయమేదో మీకు తెలుసా…? అయితే ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి. సంవత్సరానికి రెండు సార్లు సూర్యకిరణాలు మూలవిరాట్టు విగ్రహ పాదాలకు సోకేలా నిర్మించిన ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామి దేవాలయం. అరసవల్లి […]
ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడే దేవాలయం గురించి విన్నారా…? ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ మాములుగా తయారవుతుంది. ఇది చదివేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షరాలా సత్యం. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి… హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని దగ్గర్లో ఉన్న కులుకు కు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ […]