Home » devotional
గ్రహం అంటే సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు అని, విగ్రహం అంటే దేవాలయంలో ప్రతిష్టించిన మూర్తి అని, ప్రతిమ అంటే కూడళ్ళలో ఏర్పాటుచేసిన దేశ నాయకుల లేదా రాజకీయ నాయకుల బొమ్మలు అని మనకు అందరికీ తెలుసు. కానీ ఒక్కో పదం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటో వాటి యొక్క నిగూఢార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ముందుగా గ్రహం. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం లేదా ఖగోళ విజ్ఞానం ప్రకారం […]
సంస్కృతంలో లేదా తెలుగులో ఉండే పదాల వెనక అనేక నిగూఢమైన అర్థాలు దాగి ఉంటాయి. వాటిని తెలుసుకొన్నపుడే ఆ పదం యొక్క విశిష్టతను గురించి మనము అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా శివుడు అన్న పదం యొక్క వ్యుత్పత్తి ఏమిటో దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటో, దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి విషయాలు ఏమిటో, ఆ పదానికి ఈ సృష్టికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం… మనం కొంత లోతుగా ఆలోచించి చూసినట్లయితే […]
సనాతన హిందూ సంప్రాదాయంలో అనేక జంతువులను దేవుళ్ళ వాహనాలుగా పరిగణిస్తూ వాటిని గౌరవించే ఆచారం ఉంది. ఉదాహరణకు దుర్గామాతకు పెద్దపులి, సరస్వతి దేవికి హంస, శివుడికి నంది మొదలైన ముక్కోటి దేవతలందరికీ ఏదో ఒక జంతువు వాహనంగా ఉంటుంది. అలానే విజ్ఞాలను తొలగించే వినాయకుడికి వాహనం మూషికం (ఎలుక). మరి ఈ ఎలుకలకు కూడా ఒక ప్రత్యేక దేవాలయం ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు?… తెలుసుకోండి మరి… రాజస్థాన్ లోని బికనీర్ నగరానికి 32కి.మీ.ల దూరంలో […]
దక్షిణ భారతదేశ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని భద్రాచల రామయాలయంలో పలు కొత్త పూజా కార్యక్రమాలను తీసుకొస్తున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ ఆలయ పూజా విధానాలలో గల మార్పులేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదివేయండి ఈ వ్యాసం… నిత్య సర్వ కైంకర్య సేవ, నిత్య పుష్పాలంకరణ సేవ, శ్రీరామనవమి ముత్యాల సమర్పణ, వేద ఆశీర్వచనం, తులసి దండ అలంకరణ, తులాభారం అనే కొత్త పూజా విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈ పూజా విధానాలు […]
తమిళనాడులోని తిరువన్నామలైలో కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలం. ఇది పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోనే అత్యంత పెద్దదైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మరిన్ని ప్రత్యేకతలేంటో, ఇక్కడ ఉన్న చూడదగ్గ ప్రదేశాలేంటో తెలుసుకోవాల్సిందే మరి… మరింకెందుకు ఆలస్యం చదివేయండి చకచకా… అరుణాచలం అనే పదంలో అరుణ అంటే ఎరుపు రంగు అని అర్థం. అచలము అంటే కదలలేనిది, స్థిరంగా ఉండేది అని అర్థం. కదలలేనిది కొండ. మొత్తంమీద ఎరువురంగులో ఉన్న కొండ అని […]
2023వ సంవత్సరం క్యాలెండర్లను, డైరీలను అందుబాటులోకి తెస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శుభవార్త తెలిపారు. వీటిని కేటాయించిన కొన్ని ఆఫ్లైన్ కేంద్రాలలోనూ, ఆన్లైన్ లోనూ, డిడి ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, […]
ప్రముఖ సత్యనారాయణ స్వామి క్షేత్రమైన అన్నవరం లో 35 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమం స్వచ్ఛమైన అరటాకు భోజనాలతో నడుస్తున్నాయి. కానీ ఆలయ నిర్వహణ కర్తలు ప్రజా సౌలభ్యం కొరకు అరటాకులకు బదులు కంచాలు తీసుకురావాలని భావించారు. కానీ విశాఖ శారదా పీఠం దీన్ని ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నవరంలో వెలసిన రామసత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్టాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే సత్యదేవుడి […]
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా రోజుల ముందు నుండే దర్శన టికెట్లతో మొదలుకొని రూమ్ టికెట్ల వరకు అన్నింటిని ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ టిటిడి వీరికోసం కోసం చక్కటి శుభవార్త తెలిపింది. వీటన్నింటి కోసం భక్తులకు ఇబ్బందులను తగ్గించేందుకు, సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, సులభంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను తీసుకురాబోతోంది. టిటిడి తెలిపిన సమాచారం మేరకు సర్వ దర్శన టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, […]
అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం సంక్రాంతి రోజుల్లో కేరళలోని శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ 41రోజులు నిష్ఠతో దీక్ష చేపట్టి ముడుపులతో వెళ్లిన భక్తులకు మాత్రమే అయ్యప్పస్వామి 18 స్వర్ణమెట్లపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మెట్లను పదునెట్టంబడి అంటారు. మరి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా..! అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండుటకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతామూర్తులు […]
చాలా మంది కాకులు ఇంట్లోకి వస్తే అరిష్టంగా భావిస్తారు. అలాంటిది దేవాలయాల్లోకే వస్తే మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కొన్ని పుణ్యక్షేత్రాలలో మాత్రం అస్సలు కాకులే కనిపించవు. ఆ ఆసక్తికరమైన ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు, ఒడిశా లో ఒకటి ఉన్నాయి. వాటి గురించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కోటప్పకొండగా పిలువబడే క్షేత్రానికి త్రికూటాచలమని పేరు. కారణం ఇక్కడి కొండపై మూడు శిఖరాలు ఉండటమే. ఇక్కడి […]