Arunachalam:అరుణాచల ఆసక్తికరమైన విషయాలు విన్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 11, 2022 | 05:22 PM

Arunachalam:అరుణాచల ఆసక్తికరమైన విషయాలు విన్నారా…?

తమిళనాడులోని తిరువన్నామలైలో కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలం. ఇది పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోనే అత్యంత పెద్దదైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మరిన్ని ప్రత్యేకతలేంటో, ఇక్కడ ఉన్న చూడదగ్గ ప్రదేశాలేంటో తెలుసుకోవాల్సిందే మరి… మరింకెందుకు ఆలస్యం చదివేయండి చకచకా…

అరుణాచలం అనే పదంలో అరుణ అంటే ఎరుపు రంగు అని అర్థం. అచలము అంటే కదలలేనిది, స్థిరంగా ఉండేది అని అర్థం. కదలలేనిది కొండ. మొత్తంమీద ఎరువురంగులో ఉన్న కొండ అని అర్థం. ఇక్కడ ఉన్న ప్రధాన దైవం శివుడు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే అరుణాచల కొండ చుట్టూ ఉన్న 14 కి.మీ ల దూరాన్ని ప్రదక్షిణ చేయడం. భక్తులు చెప్పులు లేకుండా ఈ 14కి.మీ లు నడుస్తూ గిరిప్రదిక్షణ చేస్తుంటారు. తెల్లవారుజామున 2 లేదా 4 గంటల సమయం అనేది గిరి ప్రదిక్షణకు అనుకూలమైన సమయంగా భక్తులు విశ్వసిస్తారు. ఎందుకంటే తెల్లారేసరికి ప్రదిక్షణ పూర్తి చేసుకొని దైవ దర్శనం చేసుకోవచ్చు.

ఇక్కడి మరో చూడదగ్గ ప్రదేశం ఏంటంటే ప్రసిద్ధ ఆధ్యాత్మిక యోగి, మౌనంతో సమాధానం చెప్పగలిగే తత్వవేత్త భగవాన్ రమణ మహర్షులవారి ఆశ్రమం. చాలా మంది భక్తులు శివ దర్శనం అనంతరం రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించి, అక్కడి ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలు వంటివి చదువుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు.