Crows do not fly in these Temples:కాకులు వాలని దేవాలయాల గురించి విన్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 03:56 PM

Crows do not fly in these Temples:కాకులు వాలని దేవాలయాల గురించి విన్నారా…?

చాలా మంది కాకులు ఇంట్లోకి వస్తే అరిష్టంగా భావిస్తారు. అలాంటిది దేవాలయాల్లోకే వస్తే మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కొన్ని పుణ్యక్షేత్రాలలో మాత్రం అస్సలు కాకులే కనిపించవు. ఆ ఆసక్తికరమైన ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు, ఒడిశా లో ఒకటి ఉన్నాయి. వాటి గురించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కోటప్పకొండగా పిలువబడే క్షేత్రానికి త్రికూటాచలమని పేరు. కారణం ఇక్కడి కొండపై మూడు శిఖరాలు ఉండటమే. ఇక్కడి ప్రధానదైవం శివుడిని కోటప్పగా, త్రికూటాచలుడిగా భక్తులు పిలుస్తారు. ఈ క్షేత్ర పరిసరాల్లో కాకులు కనిపించవనేది అతిశయోక్తి కాదు. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రంలో కూడా కాకులు తిరగవని స్థల పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం అగస్త్య మహాముని తపస్సుకు భంగం కలిగించిన కాకులకు ముని శాపం తగలడం కారణంగానే అవి ఆ ప్రదేశాల్లో తిరగలేక పోతున్నాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

అలాగే ఓడిశాలోని జగన్నాథేశ్వరాలయం పరిసరాల్లో కూడా కాకులు కనిపించవు. ఇంకా ఈ ఆలయ ఆసక్తికర విషయాలు ఏంటంటే, ఈ ఆలయ శిఖరం నీడ కనిపించదు, ఆలయంపై ఎగిరే ధ్వజం గాలి వీచే దిశలో కాకుండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడటం గమనించదగ్గ విషయం. వినటానికి చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ విషయాలు అక్షరాల నిజం.