Lord Shiva:శివుడు అంటే అర్థం ఏంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 10:01 PM

Lord Shiva:శివుడు అంటే అర్థం ఏంటో తెలుసా…?

సంస్కృతంలో లేదా తెలుగులో ఉండే పదాల వెనక అనేక నిగూఢమైన అర్థాలు దాగి ఉంటాయి. వాటిని తెలుసుకొన్నపుడే ఆ పదం యొక్క విశిష్టతను గురించి మనము అవగాహన చేసుకోవచ్చు. అదేవిధంగా శివుడు అన్న పదం యొక్క వ్యుత్పత్తి ఏమిటో దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటో, దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి విషయాలు ఏమిటో, ఆ పదానికి ఈ సృష్టికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఇపుడు తెలుసుకుందాం…

మనం కొంత లోతుగా ఆలోచించి చూసినట్లయితే పురాణాలు, వేదాలు, ఇతిహాసాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాత్రలు, ఆ పాత్రల యొక్క వేషధారణ, ఆ పాత్రల సంఘటనలు వంటివి మన నిత్య జీవితానికి సరిగ్గా సరితూగుతాయి. అలాగే ఆలోచించిన శివుడు అనగా భూమి అని అర్థం. శివుడికి గల స్వరూపాన్ని గురించి చూసినట్లయితే.. మెడలో సర్పహారము, తలపై గంగాదేవి, బూడిద పూసిన శరీరము, తలపై చంద్రవంక వంటి వాటిని కలిగి ఉంటాడు. ఈ శివుడి స్వరూపము అచ్చంగా భూమితో సరిపోతుంది అది ఎలా అంటే…

శివుడు అంటే భూమి అని అనుకున్నాం కదా…! ఇప్పుడు భూమి స్వరూపాన్ని చూసినట్లయితే భూమిపై అనేక మట్టి కణాలు ఉంటాయి దీనిని బూడిద పూసిన శివుడి శరీరంగా భావించవచ్చు. అలాగే భూమికి గల సహజ ఉపగ్రహం చంద్రుడు. ఈ చంద్రవంక శివుడి తలపై ఉండే చంద్రుడిగా భావించవచ్చు. అలాగే శివుడి తలపై ఎల్లప్పుడూ గంగాదేవి ఉంటుంది. శివుడికి తలపై గంగ పడటం అంటే ఎంతో ఆనందం. ఈ విషయాన్ని అనువర్తింప చేసుకుంటే భూమి వర్షం కురిసినప్పుడు సువాసనలు వెదజల్లుతుంది, కోయిల రాగాలు, పచ్చటి చెట్లతో పులకరిస్తుంది. శివుడి మెడలో గల సర్పహారం భూమిపై ఉండే అనేక జీవరాశులను సూచిస్తుంది. అలాగే శివుడు ఎంతో ఓపికగా కంఠంలో దాచిన హాలాహలం, భూమికి ఉన్నటువంటి ఓపికను సూచిస్తుంది. ఇలా ప్రతి విషయాన్ని అనవర్తింపజేసి ఆలోచించినప్పుడు మనం చదివే ప్రతి విషయం మన నిజ జీవితానికి దగ్గరగా, అనుసంధానంగా ఉంటాయి.