Shabarimala 18 Steps:అయ్యప్పస్వామి18 మెట్ల ప్రత్యేకత తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 04:00 PM

Shabarimala 18 Steps:అయ్యప్పస్వామి18 మెట్ల ప్రత్యేకత తెలుసా…?

అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం సంక్రాంతి రోజుల్లో కేరళలోని శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ 41రోజులు నిష్ఠతో దీక్ష చేపట్టి ముడుపులతో వెళ్లిన భక్తులకు మాత్రమే అయ్యప్పస్వామి 18 స్వర్ణమెట్లపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మెట్లను పదునెట్టంబడి అంటారు. మరి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా..!

అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండుటకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతామూర్తులు మెట్లుగా మారారు. అనేది ఒక రకమైన పురాణాలు చెబుతుంటే, మరొక కథనం ప్రకారం ఒక్కో మెట్టుకి ఒక్కో దేవత ఉండటం విశేషం: 1) మహంకాళి 2) కళింకాళి 3) భైరవ, 4) సుబ్రహ్మణ్యం 5) గంధర్వరాజ 6) కార్తవీర్య 7) క్రిష్ణ పింగళ 8) భేతాళ 9) మహిషాసుర మర్దని 10) నాగరాజ 11) రేణుకా పరమేశ్వరి 12) హిడింబ 13) కర్ణ వైశాఖ 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని 16) స్వప్న వారాహి 17) ప్రత్యంగళి 18) నాగ యక్షిణి.

మరొక ఆధ్యాత్మిక కథనం ప్రకారం 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలు. ఆ తర్వాతి ఎనిమిది మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంబంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడి, స్వార్థాన్ని వదిలేయాలి. ఇక చివరి మూడు మెట్లు సత్వగుణం, రాజస గుణం, తామస గుణాలను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని విడవాలట. ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి. జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.