Annavaram Annadanam:అన్నవరంలో అన్నదానం అరటాకుల్లోనే: విశాఖ శారదాపీఠం

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 04:11 PM

Annavaram Annadanam:అన్నవరంలో అన్నదానం అరటాకుల్లోనే: విశాఖ శారదాపీఠం

ప్రముఖ సత్యనారాయణ స్వామి క్షేత్రమైన అన్నవరం లో 35 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమం స్వచ్ఛమైన అరటాకు భోజనాలతో నడుస్తున్నాయి. కానీ ఆలయ నిర్వహణ కర్తలు ప్రజా సౌలభ్యం కొరకు అరటాకులకు బదులు కంచాలు తీసుకురావాలని భావించారు. కానీ విశాఖ శారదా పీఠం దీన్ని ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అన్నవరంలో వెలసిన రామసత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు  రాష్టాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే సత్యదేవుడి సన్నిధిలో గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తున్న అన్నదాన వితరణపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదాన్ని కంచాల్లో అందించడం క్షేత్ర సంప్రదాయం కాదని గతంలో మాదిరిగానే సత్యదేవుని సన్నిధిలో అన్నదానం చేయాలని కోరింది. అన్నప్రసాద వితరణకు విస్తరాకులు లేదా అరిటాకులను వినియోగించడం హిందూ సంప్రదాయమని, ఇది శాస్త్రీయంగా కూడా ఆరోగ్యకరమైందని భావించింది. ఈ సంప్రదాయానికి అన్నవరం దేవస్థానంలో విఘాతం కలిగించవద్దని, విస్తరాకుల్లో వడ్డించే విధానాన్ని పునరుద్ధరించాలని అన్నవరం దేవాలయ అధికారులను కోరింది విశాఖ శారదాపీఠం.

అరిటాకులు దొరకడం కష్టమే కాబట్టి దీన్ని ఎదుర్కొనేందుకే కంచాల్లో అన్నదాన వితరణ చేయాలని ఆలయాధికారులు నిర్ణయించారు. దీంతో అన్నవరం దేవస్థానం వ్రత పురోహిత సంఘం రెండు లక్షల రూపాయలతో రెండు వేల కంచాలను అందించింది. భోజనాల హాలు ఇంకా సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి నిలబడి తినే పద్ధతిని వాయిదా వేశారు.