TTD App:తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ అన్ని వివరాలు యాప్ లొనే

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 04:05 PM

TTD App:తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ అన్ని వివరాలు యాప్ లొనే

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా రోజుల ముందు నుండే దర్శన టికెట్లతో మొదలుకొని రూమ్ టికెట్ల వరకు అన్నింటిని ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ టిటిడి వీరికోసం కోసం చక్కటి శుభవార్త తెలిపింది. వీటన్నింటి కోసం భక్తులకు ఇబ్బందులను తగ్గించేందుకు, సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, సులభంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను తీసుకురాబోతోంది.

టిటిడి తెలిపిన సమాచారం మేరకు సర్వ దర్శన టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అభిషేక దర్శన టికెట్లు వంటి పలురకాల దర్శన టికెట్లతో మొదలుకొని, రూమ్ టికెట్లతో సహా అన్నింటినీ ఒకే యాప్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా యాప్ ను రూపొందించనున్నారు. దీంట్లో టిటిడికి చెందిన మొత్తం సమాచారం కూడా అందుబాటులో ఉండనుంది.

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా టికెట్లకు సంబంధించిన ఛార్జీలను కూడా చాలా సులభంగా యాప్‌ ద్వారా చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్ ను భక్తులకు అందుబాటులో ఉంచుతామని టిటిడి స్పష్టం చేసింది.