Pillars of music:సంగీతం వినిపించే స్తంభాలు ఎక్కడున్నాయో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 08:21 PM

Pillars of music:సంగీతం వినిపించే స్తంభాలు ఎక్కడున్నాయో తెలుసా…?

విజయనగర సామ్రాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కట్టడాలు నేటికీ కర్ణాటకలోని హంపి నగరంలో కనిపిస్తాయి. ఇక్కడి విష్ణుమూర్తి దేవాలయం హంపీకి వెళ్ళే భక్తులను ఆలయంలోని అద్భుతమైన కళలను తిలకించేందుకు ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్నే విఠల దేవాలయం అనికూడా అంటారు. ఈ ఆలయంలోని స్తంభాలను ముట్టుకుంటే చాలు స్తంభాలు సంగీతాన్ని వినిపిస్తాయి.

ఈ ఆలయం 16వ శతాబ్దం నాటిది. ఇది రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణం ఒడ్డున ఉంది. అసలైన దక్షిణ భారత ద్రవిడ దేవాలయ శిల్పశైలిలో నిర్మించబడిన ఆలయం కూడా ఈ దేవాలయమే.

ఈ దేవాలయంలో రంగ మంటపం మరియు 56 మ్యూజికల్ స్తంభాలు ఉన్నాయి. ఈ మ్యూజికల్ స్తంభాలు ఎంతో చరిత్ర కలిగినవిగా పేరుపొందినవి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయాన్ని దర్శించడానికి తప్పక ప్రయత్నించండి మరి…! తప్పకుండా ఈ విఠల ఆలయాన్ని దర్శించి అక్కడి శిల్పకళా సంపదను, ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను తిలకించి, ఆనందించండి.