Bizili Mahadev Temple: ఏడాదిలో రెండు సార్లు పిడుగుపాటుకు గురయ్యే ఆలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 17, 2022 | 10:50 PM

Bizili Mahadev Temple: ఏడాదిలో రెండు సార్లు పిడుగుపాటుకు గురయ్యే ఆలయమేదో తెలుసా…?

ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడే దేవాలయం గురించి విన్నారా…? ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ మాములుగా తయారవుతుంది. ఇది చదివేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షరాలా సత్యం. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి…

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని దగ్గర్లో ఉన్న కులుకు కు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ మహాదేవ్’ ఆలయం పిడుగుపడే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ మాములు స్థితిలోకి మారిపోతుంది. పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తిస్థాయిలో శివలింగంలా దర్శనమిస్తుంది.

హిందీ భాషలో బిజీలీ అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం. అందుకే ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం.