Thunganath Temple:అర్జునుడు నిర్మించిన దేవాలయమేదో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 05:20 PM

Thunganath Temple:అర్జునుడు నిర్మించిన దేవాలయమేదో తెలుసా..?

పంచకేదర్ నాథ్ ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన తుంగనాథ్ ఆలయం ఎత్తైన శివలింగం కలిగిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిది. మహాభారతంలోని పాండవుల వృత్తాంతంలోని ఒక సంఘటన ఇక్కడే జరిగినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయమే అర్జునుడు నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

ఇక శ్రీ రాముడి యుగంలో కూడా ఒక కథనం ఉంది. ఈ దేవాలయంపై రావణ శిల ఉంది. చంద్ర శిల అని పిలువబడే ఒక చిన్న గుడి కూడా ఇక్కడ ఉంది. ఈ రావణశిల రామాయణానికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావణుడిని చంపిన తరువాత రాముడు అపరాధభావంతో శివుని కోసం తపస్సు చేసి, రావణుడిని చంపిన అపరాధం నుండి తనను విడిపించమని శివుడిని అభ్యర్థించాడు. తపస్సు సమయంలోనే తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాన్ని నిర్మించాడు.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన దేవాలయాలు మన దేశంలోనే ఉన్నాయంటే నిజంగా భారతదేశాన్ని సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు.