Biggest Temple in India: భారతదేశంలోని అతిపెద్ద దేవాలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 03:12 PM

Biggest Temple in India: భారతదేశంలోని అతిపెద్ద దేవాలయమేదో తెలుసా…?

భారతదేశం శిల్పకళా సంపదకు, దేవాలయాలకు పెట్టింది పేరు. మన దేశంలో దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు.
ఈ రాష్ట్రంలో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి తంజావూరు. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. ఇక్కడే ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయం ఉంది

ఈ ఆలయం హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిది. ఎక్కువ సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది.

భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా కూడా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతుంటారు. 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేట. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది.