Kadapa painted with turmeric: కడపకు పసుపు రాయడం వల్ల కలిగే లాభాలేమో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 5, 2023 | 11:50 PM

Kadapa painted with turmeric: కడపకు పసుపు రాయడం వల్ల కలిగే లాభాలేమో తెలుసా…?
హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి ఇంటి కడపకు పసుపు రాసి, కుంకుమ పెట్టడం ఒక ఆచారంగా భావిస్తారు. మన పూర్వీకులు ఏదో ఒక పనిని ఆచారంగా మొదలుపెడితే దాని వెనక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. అది ఆధ్యాత్మిక పరమైనదిగా లేదా శాస్త్రీయపరమైనదిగా అయినా అయి ఉండొచ్చు. మరి ఇలా ఇంటి గుమ్మానికి పసుపు రాయడం వెనక ఉన్న కారణాలేమిటో తెలుసుకున్నారా… అయితే ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి….
సాధార‌ణంగా కొంద‌రు గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంటారు. గడపకు పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయన్న‌ సంగతి అంద‌రికీ తెలిసిందే. కానీ గ‌డ‌ప‌కు ప‌సుపు రాయ‌డం వెన‌క చాలా మందికి కొన్ని తెలియ‌ని విష‌యాలు ఉన్నాయి. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం.
గ‌డ‌ప‌కు ప‌సుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయ‌డం ల‌క్ష్మీ ప్ర‌దం. దుష్ట‌శ‌క్తులు ఇంట్లోకి రావ‌ట‌. ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి గడపలోకి అడుగుపెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీ బయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి. ఇలా సూక్ష్మక్రిములు లేని కాళ్లతో ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంటుందని కూడా శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.