Gopuram: దేవాలయ గోపురాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు…!

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 10:36 PM

Gopuram: దేవాలయ గోపురాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు…!

దేవాలయానికి వెళ్ళేటపుడు ఎత్తైన గాలి గోపురం గుండా ప్రవేశించి, ప్రాకార ప్రదేశంలో నడిచి ధ్వజ స్తంభం, బలిపీఠం, మహా మంటపం వంటి వాటిని అన్నింటిని దాటుకుంటూ చివరగా ఉన్న మూల విరాట్టును దర్శించుకుంటాం. మరి దేవాలయంలోని ప్రతి ఒక్క భాగం ఏదో ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందనేది అక్షరాల నిజం. మరి అటువంటి దేవాలయాల భాగాలలో ఒకటైన ఆలయ గాలి గోపురం గురించి ఇపుడు తెలుసుకుందాం.

గోపురం అన్న పదానికి సంస్కృత అర్థం ఏమిటంటే గోవు + పురం = గోవు పురం అని అర్థం. అంటే మన సనాతన సంస్కృతిలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉంది, ఎంతో పవిత్రంగా భావించే ఆవు నగరంగా మనం దేవాలయాన్ని పిలుచుకుంటాం. అలాగే తెలుగు అర్థం ప్రకారం చూస్తే కోపు అంటే పొడవైనది అని అర్థం. ఇక్కడ కోపు అనేది గోపుగా మారి గోపురం అన్న పదాన్ని వాడుతున్నాం. అంటే పొడవైన ద్వారం గుండా ప్రవేశాన్ని పొందటం అనే అర్థం వస్తుంది.

పూర్వం బాటసారులు కొన్ని మైళ్ళ దూరం కాలినడక సాగించేవారు. వారికి సేదతీరడానికి ఈ గోపురాలు ఉపయోగపడేవి. గోపురాలు అప్పటి సాధారణ  భవనాల కంటే ఎత్తుగా ఉండేవి కాబట్టి ఎంత దూరంలో ఉన్నాసరే బాటసారులకు సులభంగా కనిపించేవి. అలా గోపురాలని ఆధారంగా చేసుకొని దిక్కులను తెలుసుకుంటూ వారి ప్రయాణాన్ని సాగించేవారు. ఇలా గోపురాలు ఇటు నిజజీవితలోనూ, మరొకవైపు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడేవి ఉన్నాయి.