Stories Behind Makar Sankranti: సంక్రాంతి పండుగకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా…?

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 11:02 PM

Stories Behind Makar Sankranti: సంక్రాంతి పండుగకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా…?

సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తున్న ఆచారం. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది.

తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండుగ అంటారు. దీనివెనుకున్న కథ ఏంటంటే… సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు పగలు అని చెబుతారు. ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారని. దేవతలకి స్వాగతం పలికేందుకే గాలిపటాలు ఎగరేయాలని ఒక కథనం చెబుతుంది.

సంక్రాంతి సందర్భంగా ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తై ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.