Muggulu : సంక్రాంతికి ముగ్గుల ప్రాముఖ్యత తెలుసా??

సంక్రాంతి వస్తుంది అనగానే వీధులన్నీ అందమైన రంగవల్లులతో నిండిపోతాయి. పాతకాలంలో ముగ్గును బియ్యం పిండి తోనే వేసేవారు. కానీ ఇప్పుడు ఏవైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే..........

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 08:32 PM

Muggulu : సంక్రాంతికి ముగ్గుల ప్రాముఖ్యత తెలుసా??

Muggulu :  సంక్రాంతి వస్తుంది అనగానే వీధులన్నీ అందమైన రంగవల్లులతో నిండిపోతాయి. ముగ్గు గురించి పురాణకాలంలో ఒక కథ ఉంది. ఒక రాజు గారికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు కానీ ఏదో కారణం వలన ఆ కుమారుడు మరణించాడు. అయితే రాజు ఆ కుమారుడి గురించి తపస్సు చేశాడు. అలా చేసినప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై నీ కుమారుని చిత్రాన్ని బియ్యం పిండి తో నేలపై వేస్తే కుమారునికి ప్రాణం పోస్తానని చెప్పాడు. రాజు అదేవిధంగా చేసి తన కుమారుని ప్రాణాలను దక్కించుకున్నాడు. అలా నేలపై బియ్యప్పిండితో ముగ్గులు వేయడం ప్రారంభమైంది.

పాతకాలంలో ముగ్గును బియ్యం పిండి తోనే వేసేవారు. కానీ ఇప్పుడు ఏవైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటిలో బియ్యం పిండి తో ముగ్గులు వేస్తున్నారు. అందమైన ముగ్గు ఆ ఇంటిలోని ఆనందాన్ని సూచిస్తుంది. అందమైన ముగ్గులు వాకిట్లో వేయడం వలన ఆ ఇంటికి లక్ష్మి దేవి వస్తుందని, అదృష్టం వస్తుందని నమ్ముతారు.

ముగ్గు వేసే ముందు నేల మీద రాళ్ళూ, రప్పలు ఏమైనా ఉంటే తీసేయాలి. నునుపు నేల ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. నేల మీద మనం పెట్టె చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలను ప్రతిబింబిస్తాయి. ముగ్గు మధ్యలో పెట్టే చుక్క సూర్యుని స్థానాన్ని సూచిస్తుంది. ముగ్గులో పెట్టే గీతలు స్థితిశక్తికి, చుక్కలు గతిశక్తిని సూచిస్తాయి. విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి సంకేతం. పుష్పం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారం ఆశ్లేష నక్షత్రానికి గుర్తుగా నిలుస్తాయి.

Gobbemmalu : గొబ్బెమ్మలు ఎలా చేయాలి? ఎందుకుచేస్తామో మీకు తెలుసా?

అయితే ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు వేసే రథం ముగ్గు సామజిక ఐక్యతని సూచిస్తుంది. ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును ఇంకొక ఇంటి ముందు వేసే రథం తాడు కు కలుపుతూ ఉంటారు. ఇలా చేయడం వలన అందరూ కలిసి మెలిసి సహజీవనం సాగించాలని సూచిస్తారు. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చే ముందు రోజుల నుండి ముగ్గులు ఎక్కువగా వేస్తుంటారు. ఇంకా అన్ని రకాల పండుగలకు కూడా ముగ్గులు రంగు రంగులతో వేస్తుంటారు.