Importance of Kanuma: కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయరాదట…..!

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 11:11 AM

Importance of Kanuma: కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయరాదట…..!

ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడోరోజునే కనుమ పండుగ జరుపుకుంటాం. ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు. ఈరోజు అంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం. మరి ఇంత ప్రీతికరమైన పండుగ వెనక ఉన్న చరిత్ర ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఆ రోజు నిర్వహించుకునే ఆచారాలు ఏమిటి, సంప్రదాయాలు ఏమిటి, వాటి వెనక ఉన్న శాష్ట్రీయపరమైన కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ పండగల వెనక ఉన్న వివిధ  విషయాలను ఇపుడు కూలంకషంగా తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగలో మూడవ రోజు అయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. చాలా మంది ప్రజలు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.

కనుమ మరునాటిని కూడా ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన  మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, వివిధరకాల పిండివంటకాలతో = సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయంగా వస్తుంది.