Jujube Fruits : సంక్రాంతి సీజన్ లో దొరికే రేగు పండ్లు.. ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా??

చలికాలంలో, సంక్రాంతి సీజన్ లో మాత్రమే దొరికే రేగి పండ్లు పండగకి, సాంప్రదాయాలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. రేగుపండ్లు పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉంటాయి.............

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 06:23 PM

Jujube Fruits : సంక్రాంతి సీజన్ లో దొరికే రేగు పండ్లు.. ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా??

Jujube Fruits :  పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా మంచివి. ఆ కాలంలో మాత్రమే దొరికే ఫ్రూట్స్ ని తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. వీటిని తినడం వలన ఆయా సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని చెబుతుంటారు. చలికాలంలో, సంక్రాంతి సీజన్ లో మాత్రమే దొరికే రేగి పండ్లు పండగకి, సాంప్రదాయాలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి.

రేగుపండ్లు పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉంటాయి. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలకు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఈ పండ్లను భోగినాడు పోస్తారు. కాబట్టి వీటిని భోగిపండ్లు అని కూడా అంటారు. సంక్రాంతి పండుగ వస్తుందనడానికి సూచనగా పల్లెలలో రేగు చెట్లు విరగకాస్తుంటాయి. రేగు పండ్లు చూడ్డానికి చిన్నవిగా, పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులో, పక్వానికి వచ్చాక ఎరుపురంగులో మారుతాయి. మనదేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. సంక్రాంతి సమయంలో భోగిపండ్లు పోయడానికి, ముగ్గుల్లో వేయడానికి, తాంబూలాలతో ఇవ్వడానికి కూడా వాడతారు.

Importance of Pongal on Sankranthi: సంక్రాంతి పండుగనాడు పొంగల్ ను ఎందుకు చేస్తారో తెలుసా…?

*రేగు పండ్లు మంచి ఔషధకారి.
*వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది .అజీర్తికి చాలా మంచిది.
*గొంతు నొప్పి, ఆస్తమాను, కండరాల నొప్పిని తగ్గించే గుణం రేగుపండ్లకి ఉంది.
*రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాషన్ లాగా తాగితే నీళ్ల విరోచనాలకు మంచి ఔషధం.
*రేగు పండ్లను ఒక అరలీటర్ నీళ్లలో వేసి సగం అయ్యేలా మరిగించి అందులో పంచదార లేదా తేనె కలిపి రోజూ పడుకునే ముందు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
*మెదడు బాగా పని చేయడానికి రేగుపండ్లు ఉపకరిస్తాయి.
*రేగు ఆకులను నూరి కురుపుల మీద పెడితే త్వరగా నయం అవుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లని కచ్చితంగా తినండి.