Konark Sun Temple: ఐదు రథాలమందిరము కోణార్క్ దేవాలయం…!

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 12:41 PM

Konark Sun Temple: ఐదు రథాలమందిరము కోణార్క్ దేవాలయం…!

సనాతన హిందూ సాంప్రదాయంలో ప్రత్యక్ష దేవతలైన సూర్య చంద్రులకు ప్రత్యేక స్థానం ఉంది. మరి ప్రత్యేకంగా సంక్రాంతి నాడు సూర్యుడు మాకరాశిలోకి ప్రవేశించే సందర్భంగా సంధ్యావందనాలు, పూజా కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మరి నిరంతరం ప్రకాశించే సూర్య భగవానుడికి కూడా ఒక ప్రత్యేకమైన ఆలయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇపుడు ఆలయం ఎక్కడుందో దాని ప్రత్యేకత ఏమిటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

చూడటానికి రథం ఆకారంలో నిర్మించబడిన కోణార్క సూర్యదేవాలయం, ఒడిషాలో ఎర్ర ఇసుకరాతితో 13వ శతాబ్దంలో నిర్మించారు. గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I (సా.శ. 1236-1264) లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవనం అని కూడా అంటారు. ఉత్కళంలో దీనిని పద్మక్షేత్రం అంటారు. పురాణాల కథనాల ప్రకారం సూర్య భగవానుడికి ఉపాసన జరుగిన ప్రదేశంగా దీనిని అభివర్ణిస్తారు.

ఈ ఆలయ నిర్మాణానికి వాడుకలో ఉన్న కథనం ఏమిటంటే… లాంగులా నరసింహదేవుమంత్రి శివాయిసాంత్రా- రామచందీ పరమాన్నాం కథ. ఈకథ మాదలా పంచాంగంలో ఉంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని పేరుగల స్థలమనీ అంటారు. కోణార్కుకు అర్ధమేమంటే కోణ + అర్క = కోణార్క. పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని (సూర్యదేవుని) క్షేత్రం కాబట్టి దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కానికి బౌద్ధులకు సంబంధమును ఉంది.