Home » politics
V.V.Lakshmi Narayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా ఈయన ఇప్పుడు మరోసారి […]
AP Govt: రాష్ట్రంలో రాజకీయ సభలు, ర్యాలీలలో వరస ప్రమాదాలు.. ప్రాణ నష్టంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు చేసింది. ఇకపై రాష్ట్రంలో రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోం శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు ఇకపై రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని […]
YSRCP: ఇప్పటి రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్ వ్యవహారం అయిపొయింది. ఒకప్పుడు ఓ తరం నాయకుల అనంతరం గత్యంతరం లేని పక్షంలో అదే కుటుంబంలోని మరో తరం నేతలుగా తయారయ్యేవారు. అది కూడా సీనియర్ల కనుమరుగైన తర్వాతే జూనియర్లు రంగంలోకి వచ్చేవాళ్ళు. కానీ, ఇప్పుడు వ్యవహారం పూర్తిగా వేరే. సీనియర్లు ఉండగానే వారసులను రాజకీయాలలో దింపి లీడర్లుగా తయారు చేసి వాళ్ళని ఓ పదవిలో కూర్చోబెడుతున్నారు. ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి […]
TCongress: వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలను వదిలేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని రాజకీయ సన్యాసం శపథం చేశారు. కోదాడలో ఉత్తమ్ తో పాటు ఆయన భార్య మాజీ, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల […]
AP BRS Party: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఉద్యమ పార్టీగా.. ఓ ప్రాంత హక్కుల కోసమే పుట్టిన పార్టీ కాస్త ఇప్పుడు జాతీయ నినాదం అందుకొని.. మొన్నటి వరకు కొట్లాడిన అదే ప్రాంతంలో తమ పార్టీ విస్తరణకు సిద్ధమైంది. పదే పదేళ్లు.. కాలం గిర్రున వెనక్కు తిరిగితే.. టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని.. కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఇలా తెలంగాణ నినాదాన్ని పక్కనపెట్టి జాతీయ […]
Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం, కాంగ్రెస్ లో విలీనం.. మంత్రి పదవి గడువు తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఎక్కడా అంతగా యాక్టివ్ లేరు. పలు రాజకీయ కార్యక్రమాలు.. నేతలను కలిసినా అదంతా మర్యాదపూర్వకమే కానీ.. రాజకీయాల గురించి కానేకాదని చెప్పేవారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా.. అన్నయ్య చిరు మాత్రం స్పందించలేదు. మరో తమ్ముడు నాగబాబు పవన్ కు తోడుగా పార్టీలో చేరారు కానీ.. అన్నయ్య మాత్రం ఏదో తన ప్రయత్నం చేస్తున్నాడులే […]
BRS-YSRCP: ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలు పెట్టనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గుంటూరు, లేదా విజయవాడలలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ మొదలవగానే నలుగురైదుగురు పేరున్న నాయకుల చేరికలు కూడా ఉండనున్నాయని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు సాగిపోతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై టీడీపీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలు లేవు. టీడీపీ నేతలెవరూ కేసీఆర్ పార్టీపై […]
BRS Party: ఒకవైపు గులాబీ దళపతి జాతీయ స్థాయిలో కారును పరిగెత్తించేందుకు సిద్ధమవుతుంటే.. ఇక్కడ లోకల్ లో తెలంగాణ తమ్ముళ్లు కొందరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పాగా వేస్తే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలను బీఆర్ఎస్ ఆక్రమించేసింది. ఆ రెండు పార్టీల క్యాడర్ నే కాదు నాయకులను కూడా బీఆర్ఎస్ అక్కున […]
AP News: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆదివారం రాత్రి పోలీసులు ఆయన్ను బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయన ఆసుపత్రి నుండి దీక్షను కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్షకి దిగడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. కాగా, ఆసుపత్రిలో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను టీడీపీ […]
TDP Road Show: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మారుతుంది. కందుకూరులో ఘోర విషాద ఘటన మరవక ముందే గుంటూరులో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో […]