Home » politics
AP Capital: ఆరు నూరైనా విశాఖే ఏపీకి పరిపాలనా రాజధాని. మేమిప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. త్వరలోనే సరైన సమయం చూసి పరిపాలన విశాఖ నుండి మొదలు పెడతాం.. సరైన సమయం చూసి మరోసారి మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో పెడతాం. ఇదీ ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్పేమాట. అయితే.. ఆ సరైన సమయం ఎప్పుడు? అంటే త్వరలోనే […]
TS Telangana: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఫామ్ హౌస్ లో బేరసారాలు.. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల.. ఆ తర్వాత బీజేపీపై టీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శలు.. టీఆర్ఎస్ కుట్ర చేసిందంటూ బీజేపీ ఆరోపణలు.. ఫామ్ హౌస్ లో బీజేపీ రిప్రెజెంట్స్ గా వెళ్లిన వాళ్లెవరో కూడా తమకి తెలియదని.. టీఆర్ఎస్ బద్నామ్ చేసేందుకు డ్రామాకి తెరలేపిందని బీజేపీ నేతల ఎదురుదాడి.. ఈ తంతంగమంతా దేశమంతా చూసేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు తమ […]
TS MLC Election: లెక్క ప్రకారం ఈ ఏడాది చివరన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టగా.. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. అయితే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక కావడంతో ఆశావహులు కూడా భారీగానే ఉన్నారు. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఏడు ఎమ్మెల్సీ […]
T Congress: పరిస్థితి ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదువే ఉండదు. ఒకరికి పదవి వచ్చినా గొడవే.. రాకపోయినా గొడవే. ఒకరితో పొత్తు పెట్టుకున్నా లొల్లే.. పొత్తు వద్దని చెప్పినా లొల్లే. సీనియర్లకు కాస్త చోటు ఇచ్చినా తగాదా.. జూనియర్లను కాదన్నా తగాదే.. అలా ఉంటది కాంగ్రెస్ తోటి. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను […]
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న 2024 […]
YSRCP: ఏడాది మారింది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలతో దూకుడు పెంచారు. ఇన్నాళ్లు చూద్దాం.. చేద్దాం అన్నట్లే ఉన్నా.. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడిక్కడ అస్ఫతృప్తి వెళ్లగక్కే నేతలను కట్టడి చేసే పని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు […]
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]
CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో […]
TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ.. ఇక్కడ రాజకీయం మాత్రం ఇప్పటికే పీక్స్ కు చేరింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు యాత్రలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం ఇంకేం చేస్తే మళ్ళీ అధికారం వస్తుందా అని వేటలో పడింది. ఇదిలా సాగుతుండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి వారు సీట్ల వ్యవహారంపై విన్నపాలు.. అలకలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వైసీపీలో ఇప్పుడు ఈ సీట్ల గోల బయటపడదు కానీ.. టీడీపీలో మాత్రం […]
Green Challenge: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కార్యక్రమాలలో హరిత హారం కూడా ఒకటి. సీఎం కేసీఆర్ 3 జూలై 2015న చిలుకూరు బాలాజీ దేవాలయంలో రూ.550 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా.. అప్పటి నుంచి ఊరు ఊరునా.. వాడ వాడనా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పల్లెల నుండి నగరాల వరకు కొంతమేర ఈ కార్యక్రమం తర్వాత పచ్చదనం పెరిగింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కు […]