Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 04:32 PM

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయి కావాలంటే?.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెసింగ్ కామెంట్స్!

Rahul Gandhi: పాలిటిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. అదిగో రాహుల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవేమీ నిజం కాలేదు. రాహుల్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.

తాజాగా రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకి ఈ యాత్ర ముగించనున్నారు. కాగా ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో.. ‘మీరు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నారా?’ అని యాంక‌ర్ అడగ్గా.. స‌రైన అమ్మాయి దొరికితే క‌చ్చితంగా చేసుకుంటాన‌ని రాహుల్ చెప్పారు.

రాహుల్ సమాధానానికి ‘చెక్‌లిస్టు ఏమైనా ఉందా?’ అని యాంక‌ర్ ప్రశ్నించగా.. ‘అదేమీ లేదు.. ప్రేమించే వ్య‌క్తి, ఇంటెలిజెంట్ అయితే చాలు’ అని రాహుల్ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘మీ మెసేజ్ అమ్మాయిల‌కు చేరుతుందిలేండి’ అని యాంకర్ అనడంతో.. ‘మీరు న‌న్ను ఇబ్బందుల్లో ప‌డేస్తున్నారు’ అంటూ రాహుల్ న‌వ్వేశారు.

గత ఏడాది కూడా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ఇలాంటి ప్రశ్నే ఎదురవగా అప్పుడు కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు. తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలని, అమ్మ, నానమ్మలోని మిశ్రమ లక్షణాలుంటే మరీ మంచిదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ గురించి ప్రస్తావించిన రాహుల్.. నానమ్మ అంటే తనకెంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తిలాంటి వారన్నారు. అప్పుడూ, ఇప్పుడూ రాహుల్ తనకి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.