Lavanya Tripathi : పెళ్లి చేసుకోమంటే లావణ్య త్రిపాఠి ఏముందో తెలుసా??

తాజాగా లావణ్య పులి మేక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గత కొద్ది రోజులుగా................

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 03:39 PM

Lavanya Tripathi : పెళ్లి చేసుకోమంటే లావణ్య త్రిపాఠి ఏముందో తెలుసా??

Lavanya Tripathi :  అందాల రాక్షసి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తుంది. ఇటీవలే హ్యాపీ బర్త్ డే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్స్ అంతా వెబ్ సిరీస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ బాట పట్టింది.

తాజాగా లావణ్య పులి మేక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది లావణ్య. గత కొన్ని రోజులుగా లావణ్య వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇద్దరూ స్పందించట్లేదు. తాజాగా పెళ్లి గురించి మీడియా అడగడంతో ఆసక్తిగా సమాధానమిచ్చింది.

Sir Movie : స్కూల్ పిల్లలకు సార్ సినిమాని ఫ్రీగా చూపిస్తాం అంటున్న చిత్ర యూనిట్.. స్కూల్స్ ఇలా అప్లై చేసుకోండి..

లావణ్య పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను నా పర్సనల్ లైఫ్ కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాను. పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పట్లోఅయితే పెళ్లి చేసుకోను అని తెలిపింది. దీంతో లావణ్య ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదని అర్ధమవుతుంది.