Sir Movie : స్కూల్ పిల్లలకు సార్ సినిమాని ఫ్రీగా చూపిస్తాం అంటున్న చిత్ర యూనిట్.. స్కూల్స్ ఇలా అప్లై చేసుకోండి..
మరింతమంది విద్యార్థులకు సార్ సినిమాని ఫ్రీగా చూపించడానికి చిత్రయూనిట్ ముందుకొచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా......................

Sir Movie : డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా సార్. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజయి భారీ విజయం సాధించింది. చదువుకు ఉన్న విలువ గురించి చెప్తూ ఒక మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించడంతో ఈ సినిమా తమిళ్, తెలుగులో విజయం సాధించింది. ఇప్పటికే సార్ సినిమా దాదాపు 85 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి 100 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.
ఈ సినిమాలో చదువుకు ఉన్న విలువ గురించి చెప్ప్పడంతో విద్యార్థులు, టీచర్లు ఈ సినిమాని చూడాలని చిత్రయూనిట్ ప్రమోట్ చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళు కూడా విద్యార్థులు కచ్చితంగా ఈ సినిమా చూడాలని అంటున్నారు. చదువుకు సంబంధించి ఇంత మంచి మెసేజ్ ఉండటంతో ఈ సినిమాని మరింతమంది విద్యార్థులకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల చిత్రయూనిట్ హైదరాబాద్ లోని దాదాపు 500 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా సార్ సినిమాని చూపించారు.
Neha Sharma : వెకేషన్లో కుకింగ్ క్లాస్లు తీసుకుంటున్న నేహా శర్మ..
మరింతమంది విద్యార్థులకు సార్ సినిమాని ఫ్రీగా చూపించడానికి చిత్రయూనిట్ ముందుకొచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా.. సార్ సినిమా ముఖ్య ఉద్దేశం చదువు విలువ అందరికి తెలిసేలా చేయడం. స్కూల్ పిల్లలకు ఫ్రీగా ఈ సినిమా చూపించినందుకు సంతోషిస్తున్నాము. మరింతమందికి ఈ సినిమా చేరువ కావాలని అనుకుంటున్నాము. అందుకే స్కూల్ యాజమాన్యాలు తమ విద్యార్థులకు సార్ సినిమాని ఫ్రీగా చూపించాలి అనుకుంటే contact@sitharaents.com ద్వారా సంప్రదించండి. మా టీం మిమ్మల్ని సంప్రదించి సినిమాని పిల్లలకు చూపించే ఏర్పాట్లు చేస్తారు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయంలో అందరూ మరోసారి సార్ సినిమా యూనిట్ ని అభినందిస్తున్నారు.
The Major goal of #SIRMovie #Vaathi was to spread awareness about value of education. We are happy to show our movie free of cost to the School Kids.
Please send a mail at contact@sitharaents.com & our team will reach out to you at the earliest with the show confirmation!
— Naga Vamsi (@vamsi84) March 4, 2023