Rice : బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

మన ఇంటిలో వాడే బియ్యం అప్పుడప్పుడు పురుగులు పడుతూ ఉంటుంది. అప్పుడు దానిని బాగుచేయాలంటే ఎంతో కష్టమైన పని. కొంతమంది పురుగులు పట్టిన బియ్యం బాగు చేసినా...............

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 02:26 PM

Rice : బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

Rice :  మన ఇంటిలో వాడే బియ్యం అప్పుడప్పుడు పురుగులు పడుతూ ఉంటుంది. అప్పుడు దానిని బాగుచేయాలంటే ఎంతో కష్టమైన పని. కొంతమంది పురుగులు పట్టిన బియ్యం బాగు చేసినా తినడానికి ఆసక్తి చూపించారు. కొన్ని చిట్కాలను ఉపయోగించి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండేలా చేసుకోవచ్చు.

*వేపాకులను ఎండలో పెట్టి దానిని పొడి చేసి ఒక వస్త్రంలో ఉంచి బియ్యం డబ్బాలో నాలుగు వైపులా ఉంచితే బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి.
*కర్పూరం ఘాటైన వాసన కలిగి ఉంటుంది. కర్పూరం పొడిని ఒక వస్త్రంలో ఉంచి దానిని బియ్యం డబ్బాలో నాలుగు వైపులా ఉంచాలి. ఇలా చేయడం వలన కూడా బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి.
*వెల్లుల్లి రెబ్బలను విడిగా బియ్యం డబ్బాలో ఉంచాలి ఇలా చేసినా బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి.
*వెల్లుల్లి పాయలను పొట్టు తీసి దానిని ఒక వస్త్రంలో ఉంచి దానిని బియ్యం డబ్బాలో పెట్టినా పురుగులు పట్టకుండా ఉంటాయి.
*కాకరకాయను ముక్కలుగా చేసి దానిని ఎండలో పెట్టి వాటిని ఒక వస్త్రంలో ఉంచి దానిని బియ్యం డబ్బాలో ఉంచినా పురుగులు పట్టకుండా ఉంటాయి.
*లవంగాలను విడిగా బియ్యం డబ్బాలో ఉంచినా పురుగులు రాకుండా ఉంటాయి.
*బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండడానికి లవంగాలను దంచి వాటిని పొడి చేసి దానిని ఒక వస్త్రంలో ఉంచాలి.
*సిలికా జెల్ తో నిండిన ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచినా పురుగులు పట్టకుండా ఉంటాయి.
*బియ్యం డబ్బాలో కొద్దిగా ఇంగువను ఉంచిన బియ్యం పురుగులు పట్టకుండా ఉంటాయి.