Pathaan Collections : హమ్మయ్య.. ఇన్నాళ్లకు బాహుబలి ఆ రికార్డుని బద్దలు కొట్టిన పఠాన్..
ఇప్పటివరకు పఠాన్ సినిమా 1022 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సింగిల్ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా, అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా...................

Pathaan Collections : షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పఠాన్. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. జనవరి 25న రిలీజయిన ఈ సినిమా వరుస పరాజయాల్లో ఉన్న బాలీవుడ్ కి ప్రాణం పోసింది. మొదటివారంలోనే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది పఠాన్ సినిమా. దీంతో పఠాన్ సినిమా సౌత్ సినిమాల రికార్డులు బద్దలు కొడుతుంది అనుకున్నారు.
కానీ మొదటి వారం తర్వాత పఠాన్ కి ఆడియన్స్ తగ్గిపోయారు. ఆడియన్స్ ని రప్పించడానికి టికెట్ రెట్లని కూడా తగ్గించింది చిత్రయూనిట్. మొత్తానికి కష్టపడి నెల రోజులకు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది పఠాన్ సినిమా. దీంతో RRR,KGF 2, బాహుబలి 2 సినిమాల కలెక్షన్స్ ని బద్దలు కొట్టలేదని పఠాన్ చిత్రయూనిట్ కి అర్థమైపోయింది. కనీసం హిందీ సినిమాల రికార్డులు, లోకల్ రికార్డులు అయినా సాధించాలని అనుకుంది. దీంతో ఈ సారి ఏకంగా ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చారు పఠాన్ చిత్రయూనిట్.
Lavanya Tripathi : పెళ్లి చేసుకోమంటే లావణ్య త్రిపాఠి ఏముందో తెలుసా??
ఇప్పటివరకు పఠాన్ సినిమా 1022 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సింగిల్ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా, అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక RRR,KGF 2, బాహుబలి 2 సినిమాల పూర్తి కలెక్షన్స్ కష్టమే. అయితే బాహుబలి 2 సినిమా కేవలం హిందీలోనే 510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి ఇప్పటివరకు హిందీ బెల్ట్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. పఠాన్ సినిమా మొత్తానికి కష్టపడి ఈ కలెక్షన్స్ ని దాటి హిందీ బెల్ట్ లో 511 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. మొత్తం కలెక్షన్స్ రావాలంటే కష్టమే అని భావించిన పఠాన్ యూనిట్ ఇలా అయినా సంతోషిస్తుంది.