Taapsee Pannu : తాప్సీ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

తాజాగా హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ వాక్ లో తాప్సీ ఎద భాగం ఎక్కువగా కనిపించేలా ఓ రెడ్ డ్రెస్ వేసుకుంది. అయితే..................

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 09:02 AM

Taapsee Pannu : తాప్సీ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

Taapsee Pannu :  తెలుగులో ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో అక్కడకు చెక్కేసి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అక్కడ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తాప్సీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఎక్కువ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

తాజాగా హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ వాక్ లో తాప్సీ ఎద భాగం ఎక్కువగా కనిపించేలా ఓ రెడ్ డ్రెస్ వేసుకుంది. అయితే మెడలో ఓ పెద్ద లక్ష్మి దేవి ముద్ర ఉన్న ఓ హారాన్ని వేసుకుంది. మామూలుగానే ఆ ఫ్యాషన్ షోలో తాప్సీ వేసిన డ్రెస్ బాగా వైరల్ అయింది. అలాంటి డ్రెస్ వేసుకొని ఆ లక్ష్మి హారాన్ని వేసుకోవడంతో తాప్సీ పై ఫిర్యాదు చేశారు.

Priyanka Chopra : బాలీవుడ్ లో నన్ను ఎదగనివ్వలేదు.. రాజకీయాలు ఎక్కువ.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఓ ఎమ్మెల్యే తనయుడు తాజాగా తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫ్యాషన్ షోలో తాప్సీ అలాంటి బట్టలు వేసుకొని, లక్ష్మి హారం వేసుకుంది. మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరి దీనిపై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.