Saif Alikhan : NTR 30 లో బాలీవుడ్ స్టార్ విలన్ గా??

ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా సినిమా కావడంతో భారీగా వేరే పరిశ్రమల నటుల్ని కూడా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో................

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 09:55 PM

Saif Alikhan : NTR 30 లో బాలీవుడ్ స్టార్ విలన్ గా??

Saif Alikhan :  RRR నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు అందుకున్న టీం ఒక్కొక్కరుగా అమెరికా నుంచి ఇండియాకి తిరిగివస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ హైదరాబాద్ లో అడుగు పెట్టారు. తెలుగు గడ్డపై ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక ఇప్పటికైనా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా మొదలుపెడతాడని భావిస్తున్నారు అభిమానులు. RRR సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా మొదలుపెట్టలేదు ఎన్టీఆర్. కొరటాల శివ, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయి.

ఇటీవల కొరటాల శివతో ఎన్టీఆర్ 30వ సినిమా మొదలుపెడదాం అనుకునేలోపు నందమూరి తారకరత్న మరణించడంతో సినిమా ప్రారంభం వాయిదా పడింది. ఇక ఆస్కార్ హడావిడి ఉండటంతో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి వచ్చారు. త్వరలో ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలలోనే పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.

Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?

ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా సినిమా కావడంతో భారీగా వేరే పరిశ్రమల నటుల్ని కూడా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో, బాలీవుడ్ లో కూడా ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ప్రభాస్ ఆదిపురుష్ లో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా సైఫ్ విలన్ గా చేస్తే సినిమా మరో రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు అభిమానులు. ఆల్రెడీ జాన్వీ ఉంది, ఇప్పుడు సైఫ్ కూడా ఉంటే బాలీవుడ్ లో మార్కెట్ మరింత ఈజీ అవుతుంది అంటున్నారు సినీ వర్గాలు.