Sandeep Vanga-Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా..

తాజాగా నేడు ఉదయం బన్నీ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆశ్చర్యపోయే వార్త చెప్పాడు అల్లు అర్జున్............

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 03:11 PM

Sandeep Vanga-Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా..

Sandeep Vanga-Allu Arjun :  అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశమంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమా తర్వాత సౌత్ తో పాటు నార్త్ లో కూడా బన్నీకి ఫాలోవర్స్ పెరిగారు. దీంతో పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ జరుగుతుంది. తాజాగా నేడు ఉదయం బన్నీ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆశ్చర్యపోయే వార్త చెప్పాడు అల్లు అర్జున్.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగతో అల్లు అర్జున్ సినిమాని ప్రకటించాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మాణంలో భూషణ్ కుమార్ నిర్మాతగా ఈసినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ సందీప్ వంగతో సినిమా ప్రకటించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో స్టార్ హీరో అయిపోతాడు అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.

Ranbir Kapoor : మేం బయటకు సంతోషంగా ఉన్నా.. లోపల మాత్రం బాధపడతాం..

సందీప్ వంగ ప్రస్తుతం రణబీర్ కపూర్ తో బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా ప్రకటించాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించడంతో ప్రభాస్ సినిమా ఉంటుందా అని ఆలోచనలో పడ్డారు ప్రభాస్ అభిమానులు. మరి అల్లు అర్జున్ – సందీప్ వంగ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.