Priyanka Chopra : బాలీవుడ్ లో నన్ను ఎదగనివ్వలేదు.. రాజకీయాలు ఎక్కువ.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే హాలీవుడ్ లో............

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 08:45 AM

Priyanka Chopra : బాలీవుడ్ లో నన్ను ఎదగనివ్వలేదు.. రాజకీయాలు ఎక్కువ.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

Priyanka Chopra :  బాలీవుడ్ లోనే కాదు అన్ని పరిశ్రమలలో రాజకీయాలు జరుగుతాయి, కొంతమందిని ఎదగనివ్వరు, ముఖ్యంగా లేడీస్ ని కమిట్మెంట్ అడుగుతారు, ఇవ్వని వాళ్లకి ఛాన్సులు రాకుండా చేస్తారు.. అని వింటూనే ఉంటాము. కొన్ని రోజుల క్రితం వరకు పలువురు ప్రముఖ ఆర్టిస్టులు కూడా వీటిపై కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది మహిళా నటులు కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేశారు, కొంతమంది ఆర్టిస్టులు మమ్మల్ని ఎదగనివ్వట్లేదు అని కూడా కామెంట్స్ చేసారు.

తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే హాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది కూడా. తాజాగా హాలీవుడ్ లో ఓ ఛానల్ కి ఇచ్చిన పాడ్ కాస్ట్ లో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో నన్ను తొందరగా ఎదగనివ్వలేదు. కొంతమంది నన్ను కార్నర్ చేసి, నాకు ఛాన్సులు రాకుండా చేశారు. నాకు సినిమాలు రానివ్వలేదు. అక్కడి రాజకీయాలు నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇక్కడ ఛాన్స్ రాగానే ఇక్కడికే వచ్చేసి సినిమాలు చేసుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ప్రియాంక చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

Ravanasura Trailer : రావణాసుర ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి విలనిజంతో హిట్టు కొట్టేలా ఉన్నాడు..

అయితే ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలకు సపోర్ట్ ఇస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరిన్ని వ్యాఖ్యలు చేసింది. కంగనా తన ట్వీట్స్ లో.. చూశారా, ప్రియాంక చోప్రానే చెప్పింది. బాలీవుడ్ మాఫియా సొంతంగా వచ్చి కష్టపడేవాళ్ళని ఎదగనివ్వకుండా చేస్తారు. కరణ్ జోహార్ ఆమెని బ్యాన్ చేశాడు. కరణ్ జోహార్, అతని బాలీవుడ్ మాఫియా కలిసి ప్రియాంకని భారతదేశం నుంచి వదిలి వెళ్లేలా చేశారు. ఇక అప్పట్లో మీడియా అయితే కరణ్ చెప్పినట్టు ప్రియాంక మీద నెగిటివ్ వార్తలు రాసింది అని మరిన్ని వ్యాఖ్యలు చేసింది. మరి ప్రియాంక చోప్రా, కంగనా చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.