Ranbir Kapoor : మేం బయటకు సంతోషంగా ఉన్నా.. లోపల మాత్రం బాధపడతాం..
తాజాగా రణబీర్ ఓ ఇంటర్వ్యూలో ఆర్టిస్టులు బయటకు నవ్వుతూ కనపడినా లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు అని అన్నాడు. రణబీర్ మాట్లాడుతూ............

Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ బ్రహ్మస్త్ర సినిమా తర్వాత త్వరలో తూ జూతి మైన్ మక్కార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. మార్చ్ 8న ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతం రణబీర్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చే ఇంటర్వ్యూలలో ఇటీవల అనేక విషయాలు మీడియాతో పంచుకుంటున్నాడు.
Virupaksha Teaser : సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి.. అదిరిపోయిన విరూపాక్ష టీజర్..
తాజాగా రణబీర్ ఓ ఇంటర్వ్యూలో ఆర్టిస్టులు బయటకు నవ్వుతూ కనపడినా లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు అని అన్నాడు. రణబీర్ మాట్లాడుతూ.. నేను నటుడిని కాకపోతే బరువు పెరిగితే పట్టించుకునేవాడిని కాదు. యాక్టర్స్ తిండి విషయంలో చాలా నియమాలు పాటించాల్సి వస్తుంది. ఏది పడితే అది తినలేము. ఒక్కోసారి ఇష్టమైనవి కూడా తినలేము. మీ అందరికి బయట నుంచి చూస్తే చాలా గ్లామర్ గా, కూల్ గా నవ్వుతూ కనిపిస్తాము. కానీ మేము లోపల ఈ విషయాల్లో చాలా బాధపడుతూ ఉంటాము. ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికే ఇదంతా అని భావిస్తాము అని అన్నాడు. దీంతో రణబీర్ యాక్టర్స్ కష్టాల గురించి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.