Virupaksha Teaser : సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి.. అదిరిపోయిన విరూపాక్ష టీజర్..

ఇటీవల ఎన్టీఆర్ విరూపాక్ష గ్లింప్స్ రిలీజ్ చేయగా అప్పుడే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విరూపాక్ష టీజర్ ని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. టీజర్ లో కథ ఏంటి అనేది ఎక్కడా తెలియకుండా.............

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 07:20 PM

Virupaksha Teaser : సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి.. అదిరిపోయిన విరూపాక్ష టీజర్..

Virupaksha Teaser :  కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అయి చాలా రోజులు హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ గత సినిమా రిపబ్లిక్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఈ సారి ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష అనే టైటిల్ తో రాబోతున్నాడు.

ఇటీవల ఎన్టీఆర్ విరూపాక్ష గ్లింప్స్ రిలీజ్ చేయగా అప్పుడే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విరూపాక్ష టీజర్ ని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. టీజర్ లో కథ ఏంటి అనేది ఎక్కడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. టీజర్ చూస్తుంటే ఒక ఊరిలో కొన్ని దుష్ట శక్తుల వల్ల ఓ సమస్య వస్తే సాయి ధరమ్ తేజ్ కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో ఉండబోతుంది అని తెలుస్తుంది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

RRR Movie : అమెరికాలో RRR రీ రిలీజ్.. థియేటర్స్ మోత మోగిపోతున్నాయిగా..

ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.