Samantha : ఇంత రెమ్యునరేషన్ ఇవ్వమని నేను అడుక్కోను.. ఒకసారి రిలేషన్ లో ఫెయిల్ అయితే నేనేమి అలా మారిపోను..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాటాడుతూ.. నా శ్రమ, నా ట్యాలెంట్ చూసి నిర్మాతలే మేము ఇంత రెమ్యునరేషన్ ఇస్తాం అని చెప్పాలి. అంతే కానీ.................

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 09:24 AM

Samantha : ఇంత రెమ్యునరేషన్ ఇవ్వమని నేను అడుక్కోను.. ఒకసారి రిలేషన్ లో ఫెయిల్ అయితే నేనేమి అలా మారిపోను..

Samantha :  సమంత ఇన్నాళ్లు మయోసైటిస్ తో బాధపడి ఇటీవలే కోలుకొని కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, సినిమా రిలీజ్ ల ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఓ పక్క రెండు సినిమాలు, ఓ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత మరో పక్క శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా శాకుంతలం.

మన పురాణాల్లోని దుశ్యంతుడు – శకుంతల కథ ఆధారంగా శాకుంతలం సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా వైడ్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలని తెలుపుతోంది, పలు ఆసక్తికర వ్యాఖ్యలని చేస్తోంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాటాడుతూ.. నా శ్రమ, నా ట్యాలెంట్ చూసి నిర్మాతలే మేము ఇంత రెమ్యునరేషన్ ఇస్తాం అని చెప్పాలి. అంతే కానీ నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అని నేను అడగను. అలా అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. మనం కరెక్ట్ గా పనిచేస్తే, మన దగ్గర ట్యాలెంట్ ఉంటే రెమ్యునరేషన్ అదే వస్తుంది. దానికి తగ్గట్టు మనం ఇంకా కష్టపడటం నేర్చుకోవాలి అని చెప్పింది.

Taapsee Pannu : తాప్సీ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అలాగే చాలా గ్యాప్ తర్వాత మరోసారి ప్రేమ, రిలేషన్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. సమంత మాట్లాడుతూ.. ఒకసారి నేను ప్రేమలో, రిలేషన్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రేమను నమ్మకపోవడం, నేను కఠినంగా మారడం.. ఇలాంటివి చేయను, అలా మారిపోను. గత కొన్ని నెలలుగా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్లంతా నాపై ప్రేమ చూపించారు. నేను వాళ్లకు ప్రేమను అందిస్తున్నాను. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ మాత్రమే ఉండదు అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.